రామగిరి ఎంపీపీ ఎన్నిక.. వైయ‌స్ఆర్‌సీపీ బాయ్ కాట్ 

 రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

శ్రీ సత్యసాయి జిల్లా: రామగిరి ఎంపీపీ ఎన్నికను వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీలు బాయ్ కాట్ చేస్తున్నార‌ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని,  మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు.  మంగ‌ళ‌వారం రామగిరి ఎంపీపి ఎన్నికపై తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు.  ‘టీడీపీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే  హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.  

Back to Top