బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వర్ధంతి.. వైయ‌స్‌ జగన్‌ నివాళి 

తాడేపల్లి: నేడు మాజీ ఉప ప్ర‌ధాని డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా బాబూ జ‌గ్జీవ‌న్ రామ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

‘అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మ‌హ‌నీయుడు, మాజీ ఉప ప్ర‌ధాని డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్. స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజ‌కీయ నాయ‌కుడిగా దేశానికి ఆయన అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. నేడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top