నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది

వైయస్ఆర్‌సీపీ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

గుంటూరు: తెలుగుదేశం పార్టీ గూండాల దాడిలో గాయ‌ప‌డిన మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు  ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంద‌ని  వైయస్ఆర్‌సీపీ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని అంబ‌టి ముర‌ళీకృష్ణ‌, వ‌రికూటి అశోక్‌బాబు ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. `మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై తెలుగుదేశం రౌడీలు దాడి చేయడం దారుణం. ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రోత్బలంతోనే నాగమల్లేశ్వరరావు పై దాడి జరిగింది. నాగమల్లేశ్వరరావు కుటుంబం 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. నాగమల్లేశ్వరరావు తాతలు, తండ్రుల‌ కుటుంబాలు ఆ గ్రామానికి సర్పంచ్ తో పాటు వివిధ పదవులు చేశారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పుడు ధూళ్ళిపాళ్ల నరేంద్ర తండ్రి ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. ధూళిపాళ్ల నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి.  నాగమల్లేశ్వరరావు పై హత్యాయత్నానికి కారణమైన దూళ్ళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి` అని ముర‌ళికృష్ణ‌, అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Back to Top