వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు

చంద్రబాబు డైరెక్షన్‌లో మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే ఈ కుట్రలపై చర్చ

వైయస్ జగన్‌తో వాదనకు దిగాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు

వైయ‌స్ జగన్ పర్యటనలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలనే కుతంత్రం

టీడీపీ కుట్రలను బయటపెట్టిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి 

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

వైయస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే

రైతుల పక్షాన నిలబడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు

మామిడి రైతులకు అండగా నిలబడటాన్ని కూడా రాజకీయం చేస్తారా?

మండిపడ్డ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు ఈ నెల 9న వస్తున్న వైయస్ జగన్‌ను అడ్డుకునేందుకు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతూ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్‌తో మంత్రి నారా లోకేష్ అనుమతితోనే, ఆయన సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు వైయస్ జగన్‌ను అడ్డుకుని, శాంతిభద్రతల సమస్యను సృష్టించాలనే అంశంపై సమాచాలోచనలు చేశారని వెల్లడించారు. మామిడి రైతుల పక్షనా నిలబడటాన్ని కూడా ఈ ప్రభుత్వం రాజకీయం చేయడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల కుట్రలను గమనించి, జిల్లా పోలీస్ అధికారులు వైయస్ జగన్ పర్యటనకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. 

ఇంకా ఆయనేమన్నారంటే... 

వైయస్ జగన్ ఈ నెల 9 వ తేదీన మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బంగారుపాళ్యం వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటను కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మొన్నటి నుంచి టీటీడీ ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్‌తో సహా పలువురు బెదిరించే దోరణితో మాట్లాడారు. వైయస్ జగన్ పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆయనను నిలదీస్తామని ప్రకటించారు. చంద్రబాబు దుష్ట తలంపుల్లో భాగంగా వైయస్ జగన్ పర్యటనల్లో ఆటంకాలు కల్పించి, అలజడి, శాంతిభద్రతల సమస్య సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనే కుట్ర జరుగుతోంది. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. 

 ఇది వైయస్ జగన్‌పై దాడిగానే పరిగణిస్తాం

ఒక మాజీ సీఎం, అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు రైతులకు బాసటగా నిలిచేందుకు చేస్తున్న పర్యటనపై టీడీపీ ఎమ్మెల్యేలను ఆయనపైకి ఉసిగొల్పే ప్రయత్నంను ఆయనపై దాడిగా, వైయస్ఆర్‌సీపీపై యుద్దంగా భావిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపిచండానికి అనేక వేదికలు ఉన్నా కూడా నేరుగా వైయస్ జగన్‌పై దాడి చేయడానికి సిద్దమవ్వడం దౌర్భాగ్యం. జిల్లాలో దాదాపు 1.05 లక్షల టన్నుల మామిడి పంట మాత్రమే పల్ప్‌ ఫ్యాక్టరీలకు వెలితే, ఇంకా 1.70 లక్షల టన్నులు మామిడి కొనేవారు లేక, కోతలు కూడా చేసేందుకు రైతులు భయపడే పరిస్థితి ఉంది. పంట కోతలు లేక మామిడి చెట్లు కూడా కన్నీరు కారుస్తున్నాయి. రైతుల కష్టాలను పట్టించుకోకుండా, వారికి అండగా నిలబడే వారిపైనే దాడికి పాల్పడతామని అధికారపార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడటం దారుణం. వైయస్ జగన్ పర్యటన కోసం మా పార్టీ నేతలు ఎవరూ జనసమీకరణ చేయడం లేదు. ఆయన ఎక్కడకు వెళ్ళినా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన వెంట నడుస్తుంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఆయన పర్యటనను అడ్డుకుని, ఆయనతో వాదనలకు దిగుతామని చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతున్నాం. వైయస్ జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వైయస్ జగన్ అక్కరలేదు, ఈ జిల్లాకు చెందిన ఏ వైయస్ఆర్‌సీపీ నాయకుడు అయినా సరిపోతారు. చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికై, సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాంత మామిడి రైతులను ఆదుకునేందుకు ఏ నాడు దృష్టి సారించకపోవడం వల్లే నేడు రైతులు ఈ దుస్థితిలో ఉన్నారు. రాజకీయాలు మానుకుని, ఇప్పటికైనా రైతుల కన్నీళ్ళను తుడిచే కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టాలని సూచిస్తున్నాం. లారీలు, ట్రాక్టర్‌లతో తెచ్చుకున్న మామిడిని కొనేవారు లేక, రోడ్ల మీద పారేసి రైతులు వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందనే నమ్మకం లేక మామిడి తోటలనే నరికేసుకుంటున్నారు. ఇలా నరికేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులను ఉసికొల్పి, తప్పుడు కేసులు నమోదు చేయడం, వేల రూపాయలు జరిమానాలు విధించడానికి ఈ ప్రభుత్వానికి మనస్సెలా వస్తోంది? వైయస్ జగన్ ఈ జిల్లాకు వస్తున్నందున మామిడి రైతులు సంతోషంగానే ఉన్నారని చూపించడానికి ఇటువంటి నీచానికి పాల్పడతారా? 

వైయస్ జగన్ హయాంలో కేజీ రూ.22 

సీఎం పల్ప్ ఫ్యాక్టరీలతో సమావేశం నిర్వహించారు. రైతులను ఆదుకుంటున్నామని, వైయస్ జగన్ హయాంలో మామిడి రైతులకు ఎటువంటి మేలు చేయలేదంటూ మాపైన ఆరోపణలు చేశారు. కానీ వైయస్ జగన్ పాలనలో సగటున కేజీ మామిడికి 22 రూపాయల గిట్టుబాటు ధర కల్పించారు. ఆనాడు రైతులు ఎవరూ గిట్టుబాటు ధర లేదంటూ ఇప్పుడు చేస్తున్నట్లుగా ఆందోళనలు చేయడం, రోడ్ల మీదికి రావడం జరగలేదు. ఇప్పుడు చిత్తూరుజిల్లాలో జరుగుతున్న మామిడి రైతుల అగచాట్లు, ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంను చూసి, చలించిన వైయస్ జగన్ ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రైతులకు భరోసా కల్పించేందుకే బంగారుపాళ్యంకు వస్తున్నారు. ఇందులో రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాకు లేవు. ప్రతి దానిని రాజకీయ కోణంలోనే చూసే టీడీపీ నాయకులు వైయస్ జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని, ఆయనతో వాగ్వావాదంతో రచ్చ చేయాలనే కుట్రలకు దిగారు. వైయస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాతే రైతుల నుంచి పల్ప్ ఫ్యాక్టరీలు మామిడి కొనుగోళ్ళు చేయడం, కిలోకు రూ.6 ఇస్తామంటూ టోకెన్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇస్తానంటున్న రూ.4 కి సంబంధించి ఎటువంటి చెల్లింపుల జాడ లేదు. అలాగే పొరుగురాష్ట్రం కర్ణాటకలో 2.50 లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16 చొప్పున కొనుగోలు చేయించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి హామీ పొందారు. కానీ ఇక్కడి సీఎం చంద్రబాబు కేంద్రంకు ఇలా ఏ ఒక్క లేఖా రాయలేదు. మంచి రేటుకు కొనుగోలు చేయించే కార్యక్రమంపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికే చెట్లపైనే ఉన్న మామిడి ఉత్పత్తి దాదాపు 1.70 లక్షల టన్నులు ఉంటుంది. దీనికి కూడా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. దీనిని ఒక విపత్తుగా ప్రభుత్వం భావించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముందు సమాధానం చెప్పాలి.

Back to Top