కూటమి ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తారు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బంగారుపాళ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గతంలో ఎన్నడూ మామిడి రైతులకు ఇలాంటి అధ్వాన్నపు పరిస్థితి లేదు

మద్దతుధర కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

వైయస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న మామిడి రైతులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు రానున్న వైయస్ జగన్ కోసం జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బంగారుపాళ్యంలో వైయస్ జగన్ పర్యటన ఏర్పాట్లను ఆయన పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ....`రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా నిర్లక్ష్యంతో ఉండటంతో పూర్తిగా నష్టపోయిన రైతులు తమ ఇబ్బందులను ప్రతిపక్ష నేతకు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు వైయస్ జగన్ పర్యటన రోజున బంగారుపాళ్యంకు వచ్చి, తమ గోడును వెళ్ళబోసుకోవాలనే దోరణితో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులతో సమావేశాలు నిర్వహించడం, పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్ళు చేయిస్తామంటూ ప్రకటనలు చేయించడానికే పరిమితమైంది. ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పిన రేటుకు మామిడి కొనుగోళ్లు జరగడం లేదు. మాకు తెలిసినంత వరకు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఏన్నడూ మామిడి రైతులకు ఎదురుకాలేదు. దీనిని ఒక విపత్తుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?  రాష్ట్రంలో మొత్తం రైతాంగం ఆగ్రహంతో ఉంది. పొగాకు, మిర్చి, పత్తి, కంది ఇలా ఏ పంట చూసినా కనీస గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తోంది.  ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడుస్తున్నారు. రైతులను అండగా నిలిచేందుకే తప్ప రాజకీయాల కోసం వైయస్ జగన్ వస్తున్నారా? ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూసేందుకే ఆయన వస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రైతులకు భరోసా కల్పించడం, వారికి అండగా నిలవడం కోసమే ఆయన పర్యటన` అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Back to Top