తాడేపల్లి: జులై 8న, వైయస్ఆర్ 76వ జయంతి సందర్భంగా "రాజన్న"ని స్మరించుకుంటూ.. సింగపూర్, యూకేలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగపూర్ వైయస్ఆర్‌సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి సారథ్యంలోకేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వర్చువల్‌గా మాజీ మంత్రివర్యులు.. పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా భాగమయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైయస్ రాజశేఖరరెడ్డి గురించి గుర్తుకు తెస్తూ.. "ప్రజలను, పల్లెలను మరచిపోయిన గత పాలకుల పాలనకు భిన్నంగా.. నేలతల్లినీ, పచ్చదనాన్నీ, పల్లెపట్టులనూ, రైతునీ, పాడీనీ, పంటనూ, పేదా, బీదా ఆరోగ్యాన్నీ.. వారి సొంత గూడునీ, పేద పిల్లల చదువునూ, పేదోళ్ల ఉన్నతినీ ఆలోచించి, వారి కోసం పాటుపడిన పాలన మహానేత వైయస్ఆర్ అని కొనియాడారు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివ రెడ్డి మాట్లాడుతూ.." తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికీ ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన" అని స్మరించుకున్నారు. రాబోయే రోజుల్లో.. ఎప్పుడూ కూడా ప్రజల మధ్యే ఉంటాం అని.. కేసులకు బయపడకుండా కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని.. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని.. ఇరువురు నాయకులు జూమ్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం కన్వీనర్ - మురళి. కో కన్వీనర్స్ - ప్రకాష్ , సంతోష్, కమిటీ సభ్యులు :- పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొర బాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. యూకేలో.. జులై 8న, 76వ జయంతి సందర్భంగా "రాజన్న"ని స్మరించుకుంటూ.. యుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో.. యుకే వైయస్ఆర్‌సీపీ విభాగం కన్వీనర్స్ డాక్టర్ చింత ప్రదీప్ రెడ్డి, ఓబుల్ రెడ్డి సారథ్యంలో కోర్ కమిటీ మెంబర్స్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. వర్చువల్‌గా మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.