అడ్డంకులు దాటుకుని నగరి, పుత్తూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయం

మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరి: నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నగరి మున్సిపాలిటీలో 3, 15, 18, 23, 26, 28, 38 వార్డుల్లో మొత్తం ఏడు స్థానాలను, పుత్తూరు మున్సిపాలిటీలో 4, 27, 29, 36 వార్డుల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు మాజీ మంత్రి ఆర్కే రోజాను కలవగా, ఆమె వారిని అభినందించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఎన్నికల నామినేషన్ల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుని, రౌడీయిజం, గూండాయిజంతో భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించిన వార్డుల్లో భారీ మెజార్టీలు సాధించారని తెలిపారు. పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని, అయినప్పటికీ వైయ‌స్ఆర్‌సీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, నారా లోకేష్‌ వ్యవహారశైలిపై రోజా విమర్శలు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదని, 2029 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

Back to Top