దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ను మెచ్చుకుంటుంటే..  ఎన్‌ఆర్‌ఐలతో బాబు భజన 

ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి భరోసా

చంద్రబాబు ఎన్‌ఆర్‌ఐతో మినీ మహానాడు నిర్వహించారు

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ చంద్రబాబును ఆయా దేశాలకు సీఎంగా గెలిపించుకోండి

నార్త్‌ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి  పండుగాయల రత్నాకర్‌  

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, దేశమంతా సీఎంను మెచ్చుకుంటున్నారని నార్త్‌ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి  పండుగాయల రత్నాకర్‌  పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కొని ఏపీ ప్రజలకు ఎలాంటి సాయం చేయకపోగా, తన వర్గానికి, పార్టీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలతో తానే సీఎం అన్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టి భజన చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలతో పాటు వివిధ దేశాల్లో ఉన్న ఆంధ్రులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా, భద్రత కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రత్నాకర్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే...

 • ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కరోనా వైరస్‌ నుంచి దూరంగా ఉండాలని, మీరందరూ కూడా స్దానికంగా ఉండే ప్రభుత్వాల సూచనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
 • ఏపీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  అవిశ్రాంతంగా పనిచేస్తూ కరోనా నుంచి మీ కుటుంబాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.  మీ కుటుంబాలకు వైయస్‌ జగన్‌ ద్వారా పూర్తి భరోసా ఉందని చెబుతున్నాను. 
 • నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్‌ఆర్‌ఐ లనుద్దేశించి గంటన్నరపాటు జూమ్‌ యాప్‌ ద్వారా మీటింగ్‌ పెట్టాడు. అది మినీ మహానాడులాగా ఉంది. అందులో చంద్రబాబును,ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నవారు మాత్రమే ఉన్నారు. అందులో సామాన్య ఎన్‌ఆర్‌ఐ లు ఎవరూ పాల్గొనలేదు.
 • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఎటువంటి క్రైసిస్‌ మేనేజ్‌ చేయలేదు. నేడు   ప్రతిపక్షనేతగా కొనసాగుతూ..విపత్కర పరిస్థితుల్లో వేరే రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ పరిస్థితులను పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తితో తెలివి ఉన్న ఎన్‌ ఆర్‌ ఐలు   వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొనరు. 
 • చంద్రబాబు  ఏం సాధించాడని నిన్న ఒక ప్లాన్డ్‌ గా  టీడీపీకి చెందిన వారిని వీడియో కాన్ఫరెన్స్‌లో లాగిన్‌ చేసుకుని జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. ఆ మీటింగ్‌ లో పాల్గొన్న వారిలో చాలామంది కూడా చంద్రబాబును ఉద్దేశించి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది. మీరే ఇప్పటి ముఖ్యమంత్రి అని పొగిడించుకున్నారు. వారు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్ధం ఉందా?. 
 • ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి  ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా....చంద్రబాబును గత ఎన్నికలలో ఏపి ప్రజలు 23 సీట్లు మాత్రమే ఇచ్చి ఛీ కొట్టారు.
 • ఎన్నికలలో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి ఎలా అవుతాడు.ఎంఎల్‌ఏలను కొంటారా...కొనండి...గతంలో మీరు సంతలో కొన్నట్లు కొంటారా. అదేనా పధ్దతి. 
 • లేకుంటే నిన్న ఆయనతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ లోపాల్గొన్న టిడిపి ఎన్‌ ఆర్‌ ఐ లందరూ కలసి చంద్రబాబును ఆయా దేశాలకు తీసుకుపోయి అక్కడ చేయండి ముఖ్యమంత్రిని.చంద్రబాబు అందుకు సమర్ధుడే.
 • ఏమైనా అర్ధం ఉందా...ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే ముందుకు నడిపించగలడు.విడిపోయిన రాష్ట్రం ఉన్న పరిస్దితులలో అన్ని వర్గాలకు తన నవరత్నాల ద్వారా న్యాయం చేయగలడని 151 సీట్లు ఇచ్చి గెలిపించారు.
 •  వాస్తవం ఇలా ఉంటే టిడిపి సానుభూతి పరులందరూ వీడియోకాల్‌ లో ఉండి చంద్రబాబుకు భజన చేస్తారా...విదేశాలలో ఉన్నారు...అంతో...ఇంతో చదువుకుని కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఆ మాత్రం కూడా తెలియదా....
 • ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే వైయస్‌ జగన్‌ పాదయాత్రలో చెప్పినవి అన్నీ నెరవేరుస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పనవి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
 • ఇదే సమయంలో కరోనా మహమ్మారి రావడం.దాని నియంత్రణకు వైయస్‌ జగన్‌ నడుంకట్టి చిత్తశుధ్దితో పనిచేస్తున్నారు.కరోనా వల్ల పెద్ద పెద్ద దేశాలే వణికిపోతున్న పరిస్దితులలో దేశంలోనే కరోనాను నియంత్రించడంలో ఏపి అద్భుతంగా పనిచేస్తుందని జాతీయఛానల్‌ ఎన్‌ డి టివి లో స్పష్టంగా చెప్పారు.
 • ఇది మీకు కనబడలేదా....ఇంతగా కష్టపడిపనిచేస్తున్న ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ గారిని ప్రశంసించాల్సింది పోయి చిత్తుచిత్తుగా ఓడిపోయి, ప్రజలతో ఛీకొట్టించుకున్న చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి కావాలంటారా....
 • కేంద్రమంత్రి పియుష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు...ఏపి చాలా అద్భుతంగా పనిచేస్తోంది.మెడ్‌ టెక్‌ జోన్‌ లో, విశాఖలో యుధ్దప్రాతిపదికన  కరోనా నియంత్రణకు అవసరమైనవి తయారు చేస్తున్నారని చెప్పారు. 
 •  భారతదేశంలో బాధ్యతయుతమైన పదవులలో ఉన్నవారే మన ముఖ్యమంత్రిని ప్రశంసిస్తుంటే మీ అందరూ ఎక్కడో కూర్చుని చంద్రబాబుకు భజన చేస్తారా.
 • మీరు చెప్పేది ఎలాగుందంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేం సంపాదించుకున్న డబ్బంతా ఇస్తాం. వీలైతే ముఖ్యమంత్రి అవ్వండి అన్నట్లుగా ఉంది.అసలు ఆయన వద్ద ఉన్న 23 మంది ఎంఎల్‌ ఏలలో చాలామంది.... చంద్రబాబూ.... నీవు మాకు పనికిరావు ....రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. రాబోయే 25 ఏళ్ల వరకు తనదైన శైలిలో ఏపిని పరిపాలిస్తాడు. భారతదేశంలోనే శక్తివంతమైన రాజకీయనేతగా తయారవుతాడని టిడిపిలో ఉండే వారందరూ మావద్దకు వస్తున్నారు.
 •  క్రైసిస్‌ మేనేజ్‌ మెంట్‌ అంటూ మాట్లాడారు...ఏం క్రైసిస్‌ మేనేజ్‌ మెంట్‌ చేశావు నీవు.నీవు చేసిన మేనేజ్‌ మెంట్‌ ఏంటంటే వైశ్రాయ్‌ లో ఎన్టీఆర్‌ ను వెన్నుపోటుపొడిచి మేనేజ్‌ మెంట్‌ చేశావు.లేదా గతంలో అన్ని వ్యవస్ధలలో నీకు కావాల్సిన మనుషులను పెట్టుకుని ఆ వ్యవస్ధలను మేనేజ్‌ చేశావు. 
 • నీవు అధికారంలోఉన్నప్పుడు నీ దోపిడీ సొమ్ముతో మా పార్టీ ఎంఎల్‌ ఏలను కొని వారిని మంత్రులను చేసి మేనేజ్‌ మెంట్‌ చేశావు.
 • పక్కరాష్ట్రంలో ఎంఎల్‌ ఏను కొనబోయి ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ,కేంద్రం మనకు ఇచ్చిన అవకాశాలను వదులుకుని పారిపోయి ఇక్కడకు వచ్చావు. 
 • అప్పుడెప్పుడో హుద్‌ హుద్‌ తుఫాను వస్తే నీ బినామీలందరికి దోచిపెట్టావు.నీ హయాంలో గుంటూరుజిల్లాలో అత్యంత హీనంగా పిల్లలను ఆస్పత్రిలో ఎలుకలు కొరికి చంపాయి.
 • చంద్రబాబు ఎప్పుడూ కూడా క్రైసిస్‌ మేనేజ్‌ మెంట్‌ చేయలేదు.అబద్దాలు,అవినీతి తోపాటు వ్యవస్దలను మేనేజ్‌ చేశావు.
 • మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటే విశ్వసనీయత,వ్యక్తిత్వం,నాయకత్వం,మాట ఇస్తే తప్పడు అనేవి గుర్తుకువస్తాయి.అదే చంద్రబాబు పేరు చెబితే ప్రపంచంలో వెన్నుపోటు,అవినీతి,అబద్దాలు,కుట్రలు గుర్తుకువస్తాయి.
 • సీఎం వైయస్‌ జగన్‌ పేరు  చెబితే విశ్వసనీయత, వ్యక్తిత్వం, నాయకత్వం, మాట ఇస్తే తప్పడు, పారదర్శకత అనేవి గుర్తుకు వస్తాయి. అద్భుతమైన పరిపాలన గుర్తుకు వస్తుంది.
 • వైయస్‌ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజురీయంబర్స్‌ మెంట్‌ ,జలయజ్ఞం గుర్తుకువస్తాయి.అదే జగన్‌ పేరు చెప్పగానే పెన్సన్‌ లు డోర్‌ డెలివరీ. వాలంటరీ వ్యవస్ద ద్వారా అద్భుతంగా పనిచేయిస్తున్నారు.
 •  నీవు(చంద్రబాబు) విక్టరీ అన్నట్లుగా సంకేతం చూపుతావు. కాని వీ అంటే నీ భాషలో వంచన, వెన్నుపోటు.
 • చంద్రబాబు ఎక్స్‌ పైర్డ్‌ పొలిటిషియన్‌ . తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదని సీనియర్‌ నేత కరణం బలరామ్‌  కూడా వైయస్‌ జగన్‌ వైపు చూసే పరిస్దితి ఉంది.
 • స్దానిక ఎన్నికలు వస్తే  నీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది.నీవు,నీ కుమారుడు సింగపూర్‌ లో హోటల్‌ చూసుకుంటానికి పోయే పరిస్దితి తప్పకుండా వస్తుంది.
 • రాజధాని మారిపోతుందంటూ జోలి పట్టి ఊరూరా తిరిగి పెద్ద డ్రామా క్రియేట్‌ చేసి డబ్బులు వసూలుచేస్తావా....కరోనాతో అందరూ ఆందోళనకు గురవుతుంటే నీవు వందలకోట్లతో హైద్రాబాద్‌ లో నిర్మించుకున్న మహల్‌ లో ఉంటావా...వీడియోకాన్ఫరెన్స్‌ లు పెడతావా...చేతనైతే ఇప్పుడు వచ్చి ప్రజలకు సహాయం చేయండి.
 • అదే మేం అయితే మా నాయకుడు వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలకు చేదోడుగా ఉంటూ చేతనైనంత సహాయం చేస్తున్నాం.ఇందుకు గర్వపడుతున్నాం
 • చంద్రబాబు టిడిపి ఎన్‌ ఆర్‌ ఐలతో నిర్వహించిన సమావేశం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.అది సిగ్గుమాలిన చర్య. చంద్రబాబును ప్రతిపక్షనేతగా,పార్టీ అధ్యక్షుడుగా,ప్రతిపక్షనేతగా గుర్తించేరోజులు పోయాయి.
 • చంద్రబాబు కరోనా అంటూ టిడిపి ఎన్‌ ఆర్‌ ఐలతో సమావేశం పెట్టి ప్రభుత్వంపై బురదచల్లే  కార్యక్రమం చేస్తున్నారు.దిగజారి ప్రవర్తిస్తున్నారు.
 • కరోనా కట్టడికి అద్భుతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ నేతత్వంలోని ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి ఎన్‌ఆర్‌ఐ విభాగం తరఫున రత్నాకర్‌ ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.
   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top