అనంతపురం: తాడిపత్రిలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గాలి,నీరు,ప్రజలస్వేచ్ఛను కూడా జేసీ సోదరులు హరిస్తున్నారన్నారు. జేసీ సోదరులు ఎంతనీచమైన వారో అందరికి తెలుసునన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్‌లో ప్రతిఒక్కరూ 15 లక్షలు మామూళ్లు కడుతున్నారన్నారు. చికెన్ షాపులో కేజీ 20 రూపాయలు డబ్బులు కడుతున్నారన్నారు. తాడిపత్రిలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగనన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి పోరాటం చేయాలన్నారు.ఓటు అనే ఆయుధంతో వారిని గద్దె దించాలన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.ౖ వెయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలిపితే 11వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. 11వ తేదీ తర్వాత జేసీ సోదరులు తాడిపత్రి వదిలి పారిపోవాలన్నారు. జేసీ సోదరులకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, జేసీ సోదరుల అరాచకాలు అరికట్టేందుకు జగనన్న నన్ను ప్రతినిధిగా పంపించారని తెలిపారు.ప్రజలందరికి అండగా ఉంటామన్నారు.