సీపీ ప్రెస్‌మీట్‌ కంటి తుడుపు చర్య...

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో  కుట్రకోణం బయటకు రావాలి..

వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు..

 

విజయవాడ: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అనేది చెప్పాలన్నారు. హత్యాయత్నంపై రెండు నెలలుపైగా విచారణ చేసి  తేల్చింది ఏమిటని ప్రశ్నించారు. పూర్తిగా నిందితుడు శ్రీనివాస్‌పైనే నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, హత్యాయత్నంలో వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది వాస్తవాలు బయటరాకుండా కాపాడుతున్నారన్నారు. హత్యాయత్నం వెనుక కుట్రకోణం బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. నేడు సీపీ లడ్డా  ప్రెస్‌మీట్‌ పెట్టి  కొత్త విషయాలు ఏంచెప్పారని ప్రశ్నించారు. కేవలం పథకం ప్రకారమే జరిగిందని చెప్పి చేతులుదులుపుకున్నారన్నారు. చంద్రబాబు కనుసన్నలో విచారణ జరిగిందన్నారు. కుట్రకోణం వెనుకల ఉన్న వ్యక్తులు ఎవరో తెలియజేయాలన్నారు.  కంటితుడుపు చర్యగా ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. హత్యాయత్నంలో కుట్రదారులు,పాత్రధారులు,సూత్రధారులెవరో  వాస్తవాలు బయటపెట్టాలన్నారు.

విచారణ పక్కదారి: వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ రెడ్డి

వాస్తవాలు మరుగుపరిచి తూతూమంత్రంగా వైయస్‌ జగన్‌ హత్యాయత్నంపై విచారణ చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి అన్నారు.  విచారణ చేపట్టకముందే గంటల వ్య«వధిలో  ఏవిధమైన సమాచారం లేకుండానే ప్రెస్‌మీట్‌ పెట్టి పబ్లిసిటీ కోసమంటూ డీజీపీ ప్రకటించడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ మొదటనుంచే చెబుతుందన్నారు.మొత్తం కుట్రకు కర్మ,కర్త,క్రియ నిందితుడు శ్రీనివాస్‌ను చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, హత్యాయత్నం వెనుక ఉన్న పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రెస్టారెంట్‌ యాజమానికి ఎందుకు అరెస్ట్‌ చేసి విచారణ చేయలేదని, మొక్కుబడిగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వదిలేయడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 

Back to Top