చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళంలో ఇంటింటికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 

శ్రీ‌కాకుళం:  ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. శ్రీ‌కాకుళం నియోజకవర్గం, హడ్కో కాల‌నీలో ఇంటింటికీ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  ఇంటింటా ప‌ర్య‌టిస్తూ న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.  ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ధ‌ర్మాన మాట్లాడుతూ..సొంత మామ ఎన్టీఆర్‌ను నమ్మించి, వంచించి, వెన్నుపోటు పొడిచి, అవినీతి, అక్రమాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన నేరస్తుడు, మోసగాడు రాష్ట్రంలో వేరెవ్వరూ లేరని  విమ‌ర్శించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినంత అవినీతి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదన్నారు.

పాకిస్తానీయుల సహకారంతో జరిగిన ఉగ్రదాడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం బలపడటం, ఆయనకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నా రు. ఆ భయంతోనే ఎన్నికల ముందు జగన్‌ ప్రకటిం చిన పథకాలను కాపీ కొడుతున్నారని, అయినప్పటి కీ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అ న్నారు. విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న వైయ‌స్‌ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు. 

Back to Top