వైయస్ఆర్ జిల్లా: పులివెందుల గడ్డా..దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అడ్డా అని వైయస్ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెదిరింపులు, ప్రలోభాలకు పులివెందుల ప్రజలు, వైయస్ఆర్‌సీపీ నాయకులు లొంగరు, భయపడరు. ఇక్కడ ప్రతి ఒక్కరిలో వైయస్ఆర్ పౌరుషం ఉంది. అధికార బలం ఉన్నత మాత్రాన పులివెందులలో రాజకీయాలు చేయలేరు. తండ్రి చనిపోయి మా అభ్యర్థి హేమంత్ పుట్టెడు దుఃఖం లో ఉన్నాడు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు కూటమి పార్టీలకు పులివెందులలో అభ్యర్థి కూడా లేరు. పక్క మండలం నుంచి వచ్చి పులివెందులలో నిల్చున్నారు. అధికారం డబ్బు మదం తో కూటమి రాజకీయాలు చేస్తుంది. స్కామ్స్ లో స్కిల్ ఉన్న వ్యక్తి చంద్రబాబు . కూటమి పార్టీలు పోలీసుల వ్యవస్థను నమ్ముకుని, అక్రమ మార్గాల్లో గెలవాలని కుట్రలు చేస్తున్నాయి. ప్రజలే స్వచ్చందంగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థికి మద్దతు గా ప్రచారంలో పాల్గొంటున్నారు. పులివెందుల ప్రజలు వేసే ఓటు వైయస్ జగన్‌కే అని గంటాపథం గా చెప్తున్నారు` అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాలాబాద్, మలకటపల్లి గ్రామాల్లో ఒంటిమిట్ట మండల జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారంలో అన్నమయ్య జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, కోడూరు మాజీ కోరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి,మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, సుండుపల్లి ఎంపీపీ అజంతమ్మ, వైస్ ఎంపీపీ రాయవరం రెడ్డమ్మ, కోడూరు శివ రెడ్డి, ఒంటిమిట్ట మండల కన్వీనర్ శివారెడ్డి, సుండుపల్లి చంద్ర నాయక్, ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.