కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడం ఎవరి తరం కాదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం సన్నాహక సమావేశం శుక్రవారం కాకినాడ సిటీ నియోజకవర్గంలో నిర్వహించారు. దార్వంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ..`చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారు. ప్రజల్ని మోసం చేసే నాయకుడు కాదు వైయస్ జగన్. చంద్రబాబు గెలిచిన ప్రతిసారి దొంగ హమీలు ఇచ్చాడు. తూతూ మంత్రంగా ఈసారి కూడా చంద్రబాబు పధకాలు అమలు చేస్తాడు. చంద్రబాబు తూతూ పథకాలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికి వచ్చే ఎన్నికలకు వెళ్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసంపై ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిచాలి. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం తో ప్రతి ఇంటికి వెళ్తాం. వైయస్ జగన్ అమలు చేసిన పథకాల వల్ల ఎంత మేలు జరిగింది..చంద్రబాబు పథకాల వల్ల ఏం మేలు జరిగిందో ప్రజలకు తెలియజేస్తాం. వైయస్ జగన్ ప్రజల మధ్యకు రావడం తో...కూటమి నేతలకు దడ పట్టుకుంది. చంద్రబాబు మోసగాడు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ చంద్రబాబు తో పథకాలు అమలు చేయిస్తానని పవన్ కళ్యాణ చెప్పడంతో ప్రజలు నమ్మి కూటమికి ఓట్లు వేశారు. చంద్రబాబు లానే..పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్ని మోసం చేశాడు` అని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఫైర్ అయ్యారు.