సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే వరకు  పోరాటం ఆగదు

వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై వైయ‌స్ఆర్‌సీపీ సమాలోచన సమావేశం 

కర్నూలు: సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే వరకు  పోరాటం ఆగదని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారంపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో కీలక సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, సాకే శైలజానాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ప‌రిశీల‌కుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్, గుండ్రేవుల వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయలసీమకు నీటి హక్కులు సాధించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు చెందిన కూటమి నాయకుల వైఖరిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రాంత గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై కార్యాచరణ ప్రణాళికను చర్చించారు. ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులను సాధించే దిశగా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. స‌మావేశంలో కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మిగనూరు ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కర్నూలు జడ్పీటీసీ ఛైర్మన్ పాపి రెడ్డి, ఎమ్మెల్సీ డా. మధుసూదన్, రాష్ట్ర అధికార ప్రతినిధి బి వై రామయ్య, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, విజయ డైరీ ఛైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top