ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుందాం

వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, ఎస్ఈసీ స‌భ్యులు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పిలుపు 

సి.బెళ‌గ‌ల్ మండలం పోలకల్ గ్రామంలో కోటి సంతకాల సేకరణ

క‌ర్నూలు: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను చైత‌న్య‌వంతం చేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, ఎస్ఈసీ స‌భ్యుడు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పిలుపునిచ్చారు. సి.బెళ‌గ‌ల్ మండ‌లం పోల‌క‌ల్ గ్రామంలో శుక్ర‌వారం సి బెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్ రెడ్డి  ఆధ్వ‌ర్యంలో ర‌చ్చ‌బండ‌-కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ  సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యులు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ..మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ అంశంపై వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్ర మంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు. న‌వంబ‌ర్ 11న నిర్వహించే కోడుమూరు నియోజవర్గ కేంద్రంలో ప్రజా ఉద్యమంలో పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వైద్యం ఊపిరి తీస్తున్నారు:  డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ 

కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు  నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన ఉందని మండిప‌డ్డారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. అడ్రస్‌ లేని కంపెనీలకు విలువైన భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు.ఇప్ప‌టికే పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు బంద్‌ అయ్యాయని, ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు.  మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.  

అందరం కలిసికట్టుగా పని చేద్దాం: మాజీ ఎమ్మెల్యే మ‌ణిగాంధీ
నియోజవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా  వైయ‌స్ఆర్‌సీపీని బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మునెప్ప, కోడుమూరు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు నరసింహులు, డాక్టర్స్ అధ్యక్షులు, కో ఆప్షన్ మెంబర్ హరోన్, బూత్ కమిటీ జిల్లా కార్యదర్శి తులసి రెడ్డి,  యువజన విభాగం జిల్లా కార్యదర్శి పులి రాజు, సి బెలగల్ మండలం ట్రెజరర్ వెంకటేష్, మాజీ సర్పంచ్ చంటన్న, రామచంద్రారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రామాంజనేయులు, సి బెలగల్ మండల ఆర్ టి ఐ విభాగం అధ్యక్షులు నాగేష్, ఎస్ సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న, మండల కార్యదర్శి శేఖర్, వైయ‌స్ఆర్ సీపీ మండల ఉపాధ్యక్షులు మహానంది, బాలరాజు , దామోదర్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top