కూట‌మి ప్ర‌భుత్వానికి రోడ్ల మ‌ర‌మ్మ‌తులు ప‌ట్ట‌వా?

వైయ‌స్ఆర్‌సీపీ జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ తోట న‌ర‌సింహం

కాకినాడ జిల్లా:  అస్త‌వ్య‌స్తంగా ఉన్న రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తుచేయాల‌నే ఆలోచ‌న కూట‌మి ప్ర‌భుత్వానికి లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ తోట న‌ర‌సింహం మండిప‌డ్డారు. జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం, రాజుపాలెం-రామవరం గ్రామాల మ‌ధ్య త‌క్ష‌ణ‌మే రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల దుస్థితిపై తోట న‌ర‌సింహం స్థానికుల‌తో క‌లిసి నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..   నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు చెరువులను తలపించేలా ఉన్నాయ‌ని, అడుగ‌డుగునా గుంత‌లు ఉన్నా ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పక్క నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు, ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ప్ర‌జ‌ల క‌ష్టాలు ఏంటో ఆయ‌న‌కు తెలుస్తాయ‌న్నారు. చెడిపోయిన రోడ్ల‌తో ప్రాంత ప్రజలు ఎంత నరకయాతన పడుతున్నారో గ‌మ‌నించాల‌న్నారు. త‌క్ష‌ణ‌మే రోడ్డు నిర్మించ‌క‌పోతే ప్ర‌జా పోరాటానికి వెనుకాడ‌మ‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీ రాంజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top