అబ్దుల్ కలాంకు వైయ‌స్ జగన్ నివాళులు

తాడేపల్లి: భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.

‘‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. దేశ నిర్మాణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన అందించిన విశిష్ట సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన దార్శనికత, విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.
 

Back to Top