విజయవాడ: సీఎం వైయస్ జగన్‌పై రాళ్ల దాడి దారుణమని.. ఈ ఘటనను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది కోల్డ్‌బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ఎటాక్..సీఎం వైయస్ జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు. ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు. ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు అంటూ సజ్జల మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: వైయస్ జగన్ గారి ధాటికి ధీటుగా నిలువలేక చేసిన పిరికిపంద చర్య: – వైయస్ జగన్ గారి బస్సు యాత్ర జన నీరాజనాల మధ్య ఇడుపులపాయలో మొదలై నిన్న ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. – నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా యాత్ర సాగుతోంది. ప్రజలు తండోపతండాలుగా రావడంతో చాలా ఆలస్యంగా యాత్ర సాగింది. – ఈ మధ్యలో అనూహ్యంగా జరగరాని దారుణం ఒకటి జరిగింది. – జగన్‌మోహన్‌రెడ్డి గారిపై దాడి జరిగింది. – మొదట దాని సీరియస్‌నెస్ తెలియలేదు. పొరపాటున తగిలి ఉంటుందని అనుకున్నాం. – తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్‌కు దగ్గరగా తగిలింది. – ఈ దారుణమైన ఘటనను వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తోంది. – ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మమేకం అయి తిరగడం నాయకుడి ప్రధాన లక్షణం అయితే..దానికి ధీటుగా నిలువలేక పిరికిపందలు చేసే చర్యగా మేం భావిస్తున్నాం. – జగన్ గారికి గాయం లోతుగా తగిలింది. కుట్లు పడ్డాయి. ఆర్ధగంట తర్వాత అంతా స్వెల్లింగ్ వచ్చింది. – ఆ రాయి ఒక ఇంచ్ కిందికి వచ్చి ఉంటే కంటికి తగిలి కనుచూపు పోయేది. – అలా కాకుండా కణతకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. – ఆ వస్తువు పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా తగిలింది. – జగన్ గారికి తగిలిన రాయి తగిలి, పక్కనే ఉన్న వ్యక్తి కూడా తగిలింది అంటే ఎంత ఫోర్స్‌తో వచ్చి ఉండాలి? – కింద నుంచి ఎవరో విసిరితే జరిగింది కాదు. బలంగా ఏదో ఒక దాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి. – అది క్యాట్‌బాల్ అయినా ఉండొచ్చు..ఎయిర్ గన్ అయినా అయ్యి ఉండొచ్చు. – ఏదైనా బలమైన వస్తువుతో దీన్ని ప్రయోగించి ఉంటారని అనిపిస్తోంది. – ఎవరో తుంటరి వాళ్లు ఇంత పథకం ప్రకారం చేసి ఉండటానికి అవకాశం లేదు. – నేరుగా వచ్చి తగలగడం, తగిలిన స్పాట్ చూస్తే భయం వేస్తోంది. – రాష్ట్రంలోని వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ బాధ పడ్డారు..ఆందోళన చెందారు. కడుపుకు అన్నం తినే వాడెవడైనా డ్రామా అని మాట్లాడతారా?: – రాజకీయ పార్టీలు విభేదాలను పక్కన పెట్టి స్పందించాయి. ప్రధాని మోడీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. – తెలంగాణ నుంచి కేటీఆర్‌తో సహా చాలా మంది స్పందించారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. – చంద్రబాబు కూడా ఖండించారు. పనిలో పనిగా ఎవరిపై చర్యలు తీసుకోవాలో కూడా చెప్పారు. – పొద్దున లేవగానే ఆ మీడియాను చూస్తే, వారి నాయకుల స్పందన, ధోరణి చూసినప్పుడు ఆశ్చర్యమేస్తోంది. – ఎవరైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరు చేశారో త్వరగా పట్టుకుని వాస్తవాలు బయటకు తేవాలని అడగాలి. – కానీ వీళ్లు ఇమిడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యం..కరెంట్ తీసేశారు..చేతకాని తనం అంటూ మాట్లాడారు. – ఎటాకర్ మోటివ్ ఏంటి? అతని వెనుక ఎవరున్నారు? జగన్ గారి లాంటి వారిపై ఎందుకు అటాక్ చేయాలనుకున్నారు అనేది అడగాలి. – భద్రతా వైఫల్యం అంటూ చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. – అంతటితో ఆగకుండా ఆఖరికి ఇదంతా ఒక నటన అంటూ ఈ రోజు కొత్త రాగం ఎత్తుకున్నారు. – కడుపునకు అన్నం తినేవాడెవడైనా, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా అలాంటి మాటలు మాట్లాడగలరా? – ఎవరైనా సెన్సిటివ్ పార్ట్‌పై దాడి చేయించుకుంటారా? – అసలు జనం ముఖంపై ఉమ్మేస్తారని కూడా వీరికి అనిపించదా? – దీని వెనుక ఎవరుండి ఉంటారనే విషయంలో మా పార్టీ నాయకులు సహజంగా ప్రత్యర్ధుల వైపు చూపించి ఉంటారు. – మాకు సబంధం లేదు అని చెప్పడం వరకూ ఒకే. అసలు నటన అంటే వాళ్లని మనుషులు అనాలా? – 2019లో ఇలాంటిదే జరిగితే ఆ రోజు కూడా 5 నిమిషాల్లో డీజీపీతో మాట్లాడించి అభిమానులే చేయించారు అన్నారు. – మరి ఆరోజు అధికారుల వైఫల్యం అని ఎందుకు అనలేదు? – దాన్ని కోడికత్తి శీను అంటూ ఎగతాళి చేస్తూ ఇప్పుడు వెర్షన్–2 అంటూ మాట్లాడుతున్నారు. ఈ సమాజంలో మీరు ఉండటానికి అర్హులేనా?: – రాజకీయాల సంగతి వదిలేద్దాం..అసలు ఈ సమాజంలో ఉండటానికి మీరు ఆర్హులేనా..? – నటించే లక్షణాలన్నీ వారికే ఉన్నాయి. చంద్రబాబు గారి నటన ఎలా ఉంటుందో పార్లమెంటు వద్ద వంగి ఫోటో దిగింది చూడాలి. – నిన్నగాక మొన్న రంజాన్ సందర్భంగా కేక్ పెడుతుంటే పొరపాటుగా కూడా పెదాలకు తగలకుండా ఫోటోలు దిగుతాడు. – చంద్రబాబు ప్రూవ్‌డ్ నటన కళ్ల ముందే కనిపిస్తుంటుంది. జగన్ గారికి అలాంటివి తెలియదు. – 2003లో అలిపిరి సంఘటన జరిగినప్పుడు ఎవరూ భద్రతా వైఫల్యం అని కూడా అనలేదు. – నువ్వు కావాలని నాటకం వేస్తున్నావు అని కూడా అనలేదు. – వైఎస్ రాజశేఖరరెడ్డి గారు సంఘీభావంగా తిరుపతిలో మౌనదీక్ష చేశారు. – ఎంత భద్రత ఉన్నా ఎటాక్ చేసే వాడికి ఉండే అడ్వాన్టేజ్ ఎప్పుడూ ఉంటుంది. – ఎన్నికలు వచ్చిన తర్వాత నాయకులు జనంలోకి వెళ్లడం సహజం. – వీలైనంత వరకూ రాజకీయ పార్టీలు ఇలాంటి దాడులు చేసే కల్చర్ డెవలెప్ కాకుండా చూసుకోవాలి. – అది ఎవరికైనా డేంజరే. రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఉండాలని, ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకూడదనే గేమ్ రూల్ పెట్టుకోవాలి. – చంద్రబాబుపై కూడా ఇలాంటిది జరగొచ్చు. జరగాలని మేం కోరుకోరు. – ఎవరికి జరిగినా అది ఖండించదగింది. అందుకే నిన్న జగన్ గారిపై కూడా దేశవ్యాప్తంగా రియాక్షన్ వచ్చింది. – ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే అలాంటి రియాక్షన్ రాలేదు. – ఆ నాయకులు, కార్యకర్తలకు ఇలాగే చేయండి అని చెప్పడమే కదా? – జగన్ గారి బస్సు యాత్ర ప్రారంభం అయిన తర్వాత దాని ప్రభావం ఇబ్బంది కలిగిస్తున్నది టీడీపీకే. – ఆ పార్టీతో పొత్తులో ఉన్న దత్తపుత్రుడు పార్టీ, బీజేపీలకు ఇబ్బంది. – జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత సిద్ధం, మేమంతా సిద్ధం సభలు సక్సెస్ చూశారు. జగన్ గారి క్రేజ్ మరింత పెరగడంతో చంద్రబాబు రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు: – రాయలసీమ దాటిన తర్వాత ఆ క్రేజ్ తగ్గుతుందనుకుంటూ దానికి మించి మరింతగా జనం రావడం చూశారు. – దీంతో వారికి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. దీనిలో భాగంగానే ఈ మధ్య చంద్రబాబు టోన్ మారింది. రెచ్చగొట్టడం కనిపిస్తోంది. – చంద్రబాబు ఇలాంటి దోరణికి తెలుగుదేశం పార్టీ వారికి, ఇతరులకు భరోసా ఇస్తున్నాడు. – ఇలాంటి మాటలు ఆయన నిరుత్సాహంలోంచి వస్తున్నాయి. అందుకే రెచ్చగొడుతున్నాడు. – జగన్ గారి యాత్ర సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. – ఈ దాడి కూడా ప్రమాదకరమైన రీతిలో జరగడం వల్ల ఈ యాత్ర వల్ల నష్టపోతున్న వారై ఉంటారనేది అనిపిస్తుంది. – వారి సిద్ధాంతాలు కూడా అలానే ఉంటున్నాయి కాబట్టి అనుమానం రావడం సహజం. – వీళ్లు భుజాలు తడుముకోవడం మొదలు పెట్టడాన్ని చూస్తే వీళ్లే అయి ఉంటారని ఖచ్చితంగా భావించాల్సి వస్తోంది. – ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ ఎటెంప్ట్. అదృష్టం బాగుండి జగన్ గారు బయటపడ్డారు. – 2019లో కూడా కొంచెంలో ఆ కత్తి మొడపై తగిలి ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. – కేవలం అదృష్టం, ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులతో జగన్ గారు క్షేమంగా ఉన్నారు. – ఈ రోజు వారి మాటలు చూస్తుంటే ఆయనకు ఏమీ జరగలేదనే బాధ కనిపిస్తోంది. – ఇలా చేయడం వల్ల ఆయన బస్సులోనే కూర్చుంటారని అనుకుని అయినా ఉండి ఉండాలి. – మొత్తానిక ఏదో ఒక ఆలోచనతో ప్లాన్డ్‌గానే చేశారు. మీరెన్ని కుట్రలు చేసినా జగన్ గారి యాత్రను ఆపలేరు: – కానీ యాత్రను ఆపలేరు. ఈ రోజు వైద్యుల సలహా మేరకు ఒక రోజు రెస్ట్ తీసుకున్నారు. – రేపటి నుంచి యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. – ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. – జగన్ గారికి నాటకాలు వేసి సింపతీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. – అలాంటి సింపతీ నాటకాలు చంద్రబాబు, టీడీపీ నాయకులకే చెల్లు. – 2003 అలిపిరి సంఘటన జరగగానే సింపతీ వస్తుందని మూడు నెలలు ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాడు. – ఒక చేతికి కట్టుకుని, బస్సుల్లో జనాన్ని తెచ్చి సింపతీగేమ్ ఆడినా ఫలితం రాలేదు. – చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలోనే ధ్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం ఉంది. – దీనిలో నుంచి ఏదో ఒకటి చేయించి లబ్ధిపోందాలని చూసే వ్యక్తి చంద్రబాబు. – ఎన్టీఆర్‌ను కొట్టాలంటే లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడారు. – మళ్లీ అదే ఎన్టీఆర్‌ను పెట్టుకుని ఓట్ల కోసం వెళ్లగలడు. – దగ్గుబాటి వెంకటేశ్వరరావును తోసేయాలంటే గ్రూపులు కట్టి సీన్ క్రియేట్ చేయగలడు. – ఏదైనా సరే..ఒక విలన్ క్రియేట్ చేస్తాడు. అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని విలన్‌లా క్రియేట్ చేయగలడు. – ఎందుకు తిడుతున్నాడో తెలియదు..అలా తిట్టి తిట్టి అదే నిజమని ప్రజలు చెప్పాలని చూస్తాడు. – ఈయన లక్షణాలేంటో ఆయన తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో ఉన్నాయి. – అప్పట్లో సమ్మె జరిగితే కనీసం నాలుగు బస్సు అద్దాలన్నా పగలాలి..రెండు బస్సులన్నా తగలబడాలి అని చెప్పాడట. ఇలాంటి దాడులకు వెనక్కు తగ్గే వ్యక్తి జగన్ గారు కాదు: – ఇలాంటి నెగిటివ్ లక్షణాలున్న చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న టీడీపీలోని నాయకులు, కార్యకర్తల్లో అవే లక్షణాలుంటాయి. – పథకం ప్రకారం చేసిందే. దాని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు పాత్ర ఎంత ఉందో తర్వాత తేలుతుంది. – జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరైనా ఉన్నారంటే అది ఆ పార్టీ వారే అయి ఉంటుంది. – ఎవరు దోషులో, దాని వెనుక ఎవరున్నారో దర్యాప్తులో తేలుతుంది. – ఇలాంటి దాడులకు వెనక్కు తగ్గే వ్యక్తి జగన్ గారు కాదు. – జగన్ గారి లక్షణాలే మా పార్టీ కార్యకర్తల్లోనూ ఉన్నాయి కాబట్టి ఇంత జరిగినా మేం సంయమనంతో నిరసన తెలుపుతున్నాం. – దీని గురించి పరుషంగా మాట్లాడం, లేదంటే మరొకటి చేయాలని మేం అనుకోవడం లేదు. – అది చేతకాని వాళ్లు చేసే పని మాత్రమే. ప్రజల మనుషులకు భద్రత ఒక బంధీఖానా కాకూడదు: – ప్రజలు నమ్ముకుని ఉన్న నాయకుడు జగన్ గారు. ప్రజల్లో ఉండాలంటే భద్రత ఒక బంధీఖానా కాకూడదు. – ప్రజలకు దగ్గరకు పోవాలనుకుంటున్న నాయకుడు ఇలాంటి వాటికి బెదిరి సెక్యూరిటీ ఎలా పెంచుకోవాలని అనుకోరు. – అదే సమయంలో జాగ్రత్తగానే ఉంటాం. ప్రజల్లో ఉన్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలు రాకుండానే ఉండాలి. – ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటే చైతన్యం రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల్లో తీసుకురావాలి. – మన దురదృష్టవశాత్తు టీడీపీలో అది లేదు. – సంయమనం అనేది ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకునేలా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకోవాలని అనుకుంటే ప్రజలకు దూరం కావడమే. – మొన్నెప్పుడో కేంద్రం నుంచి సెక్యూరిటీ తెచ్చుకున్నట్లున్నాడు. – అటువంటప్పుడు అంతటి వికృతమైన ఆలోచనలు వారికి ఎలా వస్తాయో కూడా అర్ధం కావడం లేదు. – ఇలాంటి వికృతమైన చేష్టలు, కామెంట్స్ చేయడానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. – వారికి సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – వీళ్లకు పాలించే అర్హత కాదు..రాజకీయాల్లోనే ఉండే అర్హతే లేదని ప్రజలు డిసైడ్ చేసుకుని ఉంటారు. – నిన్న జరిగిన సంఘటనపై వారు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లను క్షమించకూడదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. – ఇది ప్రీప్లాన్డ్ కోల్డ్ బ్లడెట్ ఎటెంప్ట్. ఈయన ప్రజల మధ్య ఉండకూడదు..బెదరకొట్టి వెనక్కు పంపాలనే మెసేజ్ ఇవ్వదలచుకున్నారు. – ఇంతటితో ఈ యాత్రను ఆపాలి అని చూశారు. – వారి ప్లాన్ సక్సెస్ అయి ఉంటే అది వేరే రకంగా కూడా ఉండి ఉండేది.