వరుస విజయాలే వైయస్‌ జగన్‌ పాలనకు నిదర్శనం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు

ప్రజల విశ్వాసాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిలుపుకున్నారు

 ఓటమి ఖాయమని తెలిసే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ డ్రామా

40 ఏళ్ల ఇండస్ట్రీ కుట్రలు ఫలించలేదు

బడుగుల జీవితాల్లో వైయస్‌ జగన్‌ వెలుగులు నింపుతున్నారు

మళ్లీ ఎన్నికలు పెట్టాలని టీడీపీ వితండవాదం

టీడీపీ భవిష్యత్‌ చెప్పడానికి కుప్పం ఫలితం ఒక్కటి చాలు

తాడేపల్లి: వరుస విజయాలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు నిదర్శమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు పార్టీ తరఫున, సీఎం వైయస్‌ జగన్‌ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ భవిష్యత్‌ ఏంటో కుప్పం ఫలితం ఒక్కటి చాలని సూచించారు. పరిషత్‌ ఎన్నికల్లో విజయంతో మాపై ప్రజలు మరింత భారం పెట్టారని, వారి విశ్వాసాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిలుపుకుంటున్నారని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రజలందరికి కృతజ్ఞతలు..రెండేళ్ల వైయస్‌ జగన్‌పాలన ఎలా ఉందని అడిగితే..ఇలా ఉంటుందని పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. మూడోసారి కూడా ఫలితాలు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మూడోదఫా పార్టీ హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తోంది. పార్టీ శ్రేణులందరికీ వైయస్‌ జగన్‌ తరఫున, పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారని ఈ ఫలితాల ద్వారా వెల్లడైంది. మా ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన నిమ్మగడ్డకు, ఆయన వెనుక ఉన్న చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 2020 మార్చిలోనే జరగాల్సి ఉంది. 2021లో ఎన్నికలు జరిగి దపదపాలుగా ఫలితాలు రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం.

దీవాళ తీసి అడ్డంగా ఐపీ పెట్టిందా అన్నట్లుగా ఉన్న టీడీపీ ని ఎత్తి చూపుతున్నాం. ఈ రోజు అచ్చెన్నాయుడు అన్నారట. దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటున్నారట. ఎన్నికల్లో తప్పుకున్న టీడీపీ నేతలు మళ్లీ ఎన్నికలు పెట్టమని అంటున్నారు. వీరి మాటలు చూస్తే పాత సామెత గుర్తుకు వస్తుంది. బొక్కబోర్లపడి 2019లో ముక్కు, మూతి సొట్టపోయింద. అప్పటికైనా బుద్ది తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారు.  ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఎక్కడో కొంపలు అంటుకుపోతున్నాయని భావించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. 

నిజం ఏంటంటే వైయస్‌ జగన్‌ 10 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు కళ్లారా చూశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దాని ఫలితాలు బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రతిఫలిస్తుండగా ఈ ఎన్నికలు వచ్చాయి. 98 శాతం జెడ్పీటీసీలు వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై విజయం సాధించారు. అబద్ధాలు, కల్పితాలపై కాకుండా విశ్వసనీయతపై ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో ఈ ఎన్నికల ద్వారా రుజువైంది. గుణపాఠం నేర్చుకునేందుకు టీడీపీకి అవకాశం లేదు. మిగతా పార్టీలైనా నేర్చుకోవాలి. 

వైయస్‌ జగన్‌ పథకాలు ప్రలోభపెట్టేవి కావు. అన్ని వర్గాల ఆర్థిక,సామాజిక, స్వాతంత్య్రం, నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే ..ఎవరికి వాళ్లు తమ సొంత కాళ్లపై నిలబడగలిగితే..ఎలా ఉంటాయో ఫలితాలు అన్నవి ఈ రెండేళ్ల పాలనలో చేసి చూపించారు. ఈ ఫలితాలు సువర్ణ అక్షరాల్లో రాసుకోవచ్చు. 

ఇందులో ఎవరు మర్చిపోకూడని విషయం..దేశంలో ఎక్కడ జరగని విధంగా అన్యాయంగా ఈ ప్రక్రియ జరిగింది. 2020లో ప్రారంభమై..2021 ఏడాదికి ఫలితాలు రావాల్సి వచ్చింది. వ్యవస్థలను ఇంత మ్యాలుఫులేషన్‌ చేయడానికి ఇదే ఉదాహరణ. 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి..ఆ రోజు చంద్రబాబుకు ధైర్యం లేక వాయిదా వేయించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం ఎదుర్కోవాలని వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారు. 

మొత్తం ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంట నిలిచి 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి భారీ మెజారిటీ ఇచ్చారు.  ప్రజలు ఆదరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నిసార్లు వాయిదా వేసినా మేమే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉంది. ప్రజలు కూడా మేం వైఎస్‌ఆర్‌సీపీకే ఓట్లు వేస్తామని విశ్వాసంతో ఉన్నారు. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. అర్బన్‌ ఏరియాల్లో ఎన్నికలు పెడితే బాగుంటుందని చంద్రబాబు చిల్లర ఆలోచన వచ్చింది. ఆ తరువాత కాదు కాదు..సర్పంచ్‌ ఎన్నికలు తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎడాపెడా  వాయించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా టీడీపీకి గుణపాఠం చెప్పారు. 

తప్పనిసరిగా పరిషత్‌ ఎన్నికలు పెట్టాల్సి వస్తే..తాజాగా నోటిఫికేష్‌ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఎప్రిల్‌ 8న జరిగిన ఎన్నికలు..బ్యాలెట్‌ బాక్స్‌లో నిక్షిప్తమైన ఫలితాలు ఇవాళ వెలుబడ్డాయి. ఎప్పుడైతే ట్రెండ్‌ మారిందో తెలియక ఎన్నికలు బాయికట్‌ చేస్తున్నామని డ్రామాలు ఆడారు. ఆ తరువాత ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని కుట్రలకు తెర లేపారు.

మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రలోభాలు లేకుండా ఎన్నికలు పెట్టాం. చంద్రబాబు మాత్రం రెండు ఆప్షన్స్‌ పెట్టుకున్నారు. తీరా ఓడిపోయిన తరువాత మళ్లీ ఎన్నికలు జరపమని కోరుతున్నారు.  ఓటర్లు అంటే అంత ఎట్టికి వచ్చారా? అడగడానికి ఒక పద్ధతి ఉండాలి. 

కుప్పం సంగతి తీసుకుంటే మీ బతుకులు ఏంటో గమనించండి. ఇంతకంటే ఘోర ఓటమి ఏమి కావాలి. మా ఫలితాలు వెబ్‌సైట్‌లో కూడా పెడతాం. చెక్‌ చేసుకోండి. కుప్పంలో ఓన్‌ చేసుకొని చంద్రబాబును గెలిపించిన ఆ పార్టీ శ్రేణులు ఇవాళ చేతులెత్తేశారు. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు వచ్చాయి. 62952 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీకి మెజారిటీ వచ్చింది. టీడీపీ సమాప్తం అయ్యిందని చెప్పడానికి ఈ ఫలితం ఒక్కటి చాలు. టీడీపీ నేతలు చేతులారా చేసుకోవడం వల్లే ఇలాంటి పరాజయం ఎదురైంది.

వైయస్‌ జగన్‌ పాలనలో పారదర్శకత ఉంది. జనం వైయస్‌ జగన్‌ను అర్థం చేసుకున్నారు. ఏదైతే మాట్లాడుతారో..అదేచేస్తారని నమ్ముతున్నారు. కొత్త మాడల్‌గా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా సీఎం వైయస్‌ జగన్‌ నిబ్బరం కోల్పోకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 

ప్రజలకు ఇచ్చే ప్రతి పైసా వారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయానికి ఒక కొత్త ఊపు వచ్చింది. విద్యలో విప్లవాత్మకమార్పులు వచ్చాయి. 2019లో 50 శాతం ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ 75 శాతానికిS పైగా పాజిటివ్‌ ఓటు వైయస్‌ఆర్‌సీపీకి వచ్చింది. ఓటర్లు వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలిచారు. రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంలా చూస్తున్నారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయి. గతంలో చంద్రబాబు చినాన్న చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారట. వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూసి నేర్చుకో అన్నారట. ఆ రోజు నేర్చుకోకుండా అడ్డగోలుగా పాలన చేశారు కాబట్టే ఈ రోజు ఈ ఫలితాలు వచ్చాయి.  

 తాలిబాన్‌ దేశం పార్టీగా టీడీపీకి పేరు పెట్టారు. బూతులు తిడుతూ..చేతకాని అసమర్థతను చూపుతున్నారు.మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ..అందరితో ఆనందాన్ని పంచుకుంటూ..మరింతగా మాపై బాధ్యత పెంచారు. అందరికీ సంక్షేమ పథకాలు అందేలా మా పార్టీ అడుగులు వేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top