తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్‌లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వరదలు రావడంతో బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్.. ఇవ్వన్నీ కాదు.. కరకట్టపై ఉన్న బాబు నివాసం కూల్చేసి శభాష్ అనిపించుకో అని అన్నారు. మాజీ మంత్రి అంబటి గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే మృతదేహాలు బయట పడుతున్నాయి. వైయస్ జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయి. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ముందస్తు చర్యలు ఏం చేపట్టారో ప్రజలకు చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి ముందే అలర్ట్ వచ్చింది. హెచ్చరికలు వస్తే అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ పెట్టారా?. వరదలు సంభవిస్తే చంద్రబాబు సమీక్ష నిర్వహించలేదు. గత నెల 28వ తేదీనే అలర్ట్ వస్తే అధికారులను అప్రమత్తం చేయలేదు. ఎవరిపై కక్ష సాధిద్దాం. ఎవరిని వేధించాలి అనే ఆలోచనేతోనే ఉన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదు. బుడమేరుపై తప్పుడు ప్రచారం.. వైయస్ జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయి. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోరేజీ ఎక్కువైతే అప్పుడు సముద్రంలోకి నీరు వదలాలి. చంద్రబాబు కుషన్ మేనేజ్‌మెంట్ చేయలేకపోయారు. ఎవరైనా బఫర్ జోన్‌లో ఉన్న ఇంట్లో ఉంటారా?. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అక్కడే ఉంటున్నారు. అనుమతిలేని బఫర్ జోన్‌లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బఫర్ జోన్‌లో ఉన్న కట్టడాలను తొలగించాం. బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2005లో కూడా బుడమేరుకు వరద వచ్చి మునిగిపోయింది. నీటిని మళ్లించాలని ఆనాడు వైయస్ఆర్ నిర్ణయించారు. వాటర్ డైవర్షన్ కోసం రూ.241 కోట్లు వెంటనే విడుదల చేశారు. పోలవరం రైట్ కెనాల్‌కు నీరు మళ్లించేలా చర్యలు చేపట్టారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తానని చంద్రబాబు అంటున్నారు. రామోజీరావు తప్పు చేస్తే ఎందుకు శిక్షించలేదు. మునిగిపోయే ఇంట్లో ఉండటం చంద్రబాబు తప్పు. కృష్ణా నది ఒడ్డున ఉన్నాడు కాబట్టే చంద్రబాబు ఇల్లు మునిగింది. బాబుతో మాట్లాడు పవన్.. బాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పడవలపై తిరుగుతూ షో చేస్తున్నాడు. వరదలు సంభవిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ విజయవాడ వచ్చాక పవన్ మేల్కొన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగాక మీకు వరదలు గుర్తొచ్చాయి. పవన్ విజయవాడుకు రాకపోవడం తప్పు కాదు.. స్పందించకపోవడం తప్పు. బుడమేరు అంతా ఆక్రమించారని పవన్ అంటున్నారు. వారి కట్టడాలపై చర్చించాలన్నారు. పవన్‌కు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు బఫర్ జోన్‌లో ఉన్నారు. ముందు చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడు పవన్. కరకట్ట ఇంట్లో నుంచి బాబును ఖాళీ చేపించు. బఫర్ జోన్‌లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని స్టే నుంచి తప్పించి.. కూల్చివేసి పవన్ శభాష్ అనుకోవాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.