తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన.. 

గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు

తిరుపతి: న‌గ‌రంలోని తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద తిరుపతి నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించడంపై భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కట్టడి చేయడం సరికాదని, మీడియా స్వేచ్ఛను అణిచివేయడం అనేది అన్యాయమని ఆయన విమర్శించారు.
 

Back to Top