అన్నమయ్య జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న బిరుదు ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి పట్టణంలో మంగళవారం వైయస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన ఆపద్బాంధవుడు వైయస్ఆర్ అని అన్నారు. జలయజ్ఞంతో కరవు సీమలో జలసిరులు కురిపించిన దార్శినికుడని, ఫీజు రీయంబర్స్ మెంట్ తో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన మహనీయుడన్నారు. ఉచిత విద్యుత్ తో రైతన్న సాగుకు అండగా నిలిచారన్నారు.మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు, నక్సలిజాన్ని రూపుమాపి, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలోపెట్టిన మహానేత అని అన్నారు. రాయచోటి పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య తీర్చారన్నారు. రాయచోటి తో మహానేతకు విడదీయరాని అనుబంధం ఉండదన్నారు. భారతదేశం గర్వించదగ్గ నేత వైయస్ఆర్: జెడ్ పి మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం భారతదేశం గర్వించదగ్గ నేత వైయస్ఆర్ అని జెడ్ పి మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. వైయస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు.పేదల కోసం వైయస్ఆర్ సిపి అధినేత వైయస్ జగన్ ఎళ్లవేళలా పోరాడుతున్నారన్నారు.