మ‌హానేత జ‌యంతి రోజు పార్టీ ప్లీన‌రీ

జూలై 8, 9.. రెండు రోజుల పాటు నిర్వాహ‌ణ‌

గుంటూరు - విజయవాడ మధ్య వైయ‌స్ఆర్ సీపీ ప్లీనరీ

పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్య‌క్షులు, రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ల‌తో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి టెలీ కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: దివంగ‌త మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్య‌క్షులు, కోఆర్డినేట‌ర్ల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ సంద‌ర్భంగా పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలియచేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలకు, అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. జూలై 8వ తేదీన ప్రారంభమై 9 వతేదీ సాయంత్రం వరకు ప్లీనరీ కొనసాగుతుందని, పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేవిధంగా అందరూ సమష్టిగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాన ఉధ్దేశ్యం అన్నారు. పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికి వాటిని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకు నడవాలన్నారు. వైయస్ఆర్ సీపీలో వర్గాలకు తావులేదన్నారు. అలాంటివి ఎవరి మధ్యన ఉన్నా వాటిని ప్రోత్సహించే పరిస్దితి ఉండదని స్పష్టం చేశారు. ఇది పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.
    
పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలకు సంబంధించి పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీకి లాయల్ గా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పాటించడంతో పాటు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన విధంగా ప్రాతినిధ్యం ఉంటుంద‌న్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు స్ధానికంగా పార్టీ పటిష్టతకోసం పాటుపడేవారిని సూచించాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆకాంక్ష అని వివరించారు. ఈ పేర్లను జూన్ 10వ‌ తేదీనాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలన్నారు. తదనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్ కోఆర్డనేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీల నియామక ప్రకటన అనేది పార్టీ ప్లీనరీలో జరుగుతుందని వివరించారు. బూత్ కమిటీలకి సంబంధించి కూడా సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం పేర్లను పంపాలని కోరుతున్నాను. 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని తెలియచేశారు. సంక్షేమ పథ‌కాలు అందుకుంటున్న లబ్దిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థ‌మైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారనేది కూడా స్పష్టమైంది. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం అయిందని తెలిపారు. ప్రజలలో వైయస్ జగన్‌కి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను బస్సుయాత్ర విజయవంతం అయిన తీరు తెలియచేస్తోందని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top