అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళా సాధికారత కు పెద్ద పీట వేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో వై.యస్.ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో మంత్రి పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ , జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పలాస నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు(పులిరాజు) తదితరులు పాల్గొన్నారు. వైయస్ఆర్ జిల్లాలో.. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో నిర్వహించిన వైయస్ఆర్ ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే శెట్టిపల్లి రాఘురామిరెడ్డి పాల్గొని 902 స్వయం సహాయక సంఘాల సంబంధించి రూ.8,31,37,804 కోట్ల రూపాయలను 4వ విడత వైయస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ మహిళల సాధికారతకు అహర్నిశలు కృషి చేసి సంక్షేమ క్యాలండర్ పెట్టి సంక్షేమ పథకాల పండుగలే పండుగలు జరుపుతున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని పేద, నిరుపేదలకు " నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న ప్రభుత్వం లొనే మహిళా ఆర్థిక స్వావలంబన సాధికారతకు పెద్ద పీట వేశారని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఒక ప్రభుత్వ పథకాల క్యాలండర్ ను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారత లో భాగంగా ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా వైయస్ఆర్ ఆసరా" పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టి బీసీ, ఎస్సీ, ఎస్ టి, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమమే "వైయస్సార్ ఆసరా" అని అన్నారు. మనమహిళల జీవితాల్లో మరిన్ని మనకుటుంబంలో సుస్థిరమైన ఆదాయం రావాలని, మనకు కాంతులు తీసుకురావాలని, మనంగా సృష్టించుకునే వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని మనంఅర్థికంగా అభివృద్ధి చెందుతూ కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేశారని చెప్పారు. మనలను మనకాళ్ళ మీద నిలబడేటట్టుగా చేయుటకు, మనజీవనోపాధిని మెరుగు పర్చుకొనే విధంగా, మెదటి ఏడాది అమూల్, హిందూస్తాన్ యూని లివర్, ఐ.టి.సి., ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. రెండవ ఏడాది మహేంద్ర&ఖేతి అజియో రిలయన్స్, గ్రామీణ వికాసకేంద్రం, టేనేజర్, వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మనకువ్యాపార మార్గాలు చూపించి,ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో మనకుసుస్థిరమైనఅర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి బాటలు వేశారని అన్నారు. వైయస్సార్ ఆసరా పథకంతో మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపడమే జరుగుతోందని చెప్పారు. అర్హత ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాల అన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లా మహిళలను ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయడంతో పాటు వారిలో కొండంత ఆత్మస్థైర్యం నింపుతోంది అన్నారు. అందించే సహాయాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా తమ వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించు కోవాలన్నారు. మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకున్ని కొనసాగించాలని అన్నారు.