చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వం..

ఎలక్షన్‌ కమిషన్‌పై చంద్రబాబుకు విశ్వాసం లేదు..

స్వలాభం కోసం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు

తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టొదు

వైయస్‌ జగన్‌ నిజాయతీగా పోరాడుతున్నారు

గజపతి నగరం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వం అని, ప్రత్యర్థుల మీద  బురద చల్లుతూ ఆయన రాష్ట్రాన్ని దోచేస్తారని వైయస్‌ విజయమ్మ అన్నారు.25 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేకహోదా సాధించుకుందామన్నారు.అప్పడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గజపతి నగరం ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

ఎలక్షన్‌ కమిషన్‌పై చంద్రబాబుకు విశ్వాసం లేదు. 2009 లో వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు డీజీపీ ఎస్‌ఎస్‌పి యాదవ్‌పై  చంద్రబాబు  ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఆయనను విధుల  నుంచి తొలగించారు. ఆ రోజు చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌పై ధర్మశాస్త్ర ఉపదేశాలు చేశారు.ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పుడు అంతా ఎలక్షన్‌ కమిషన్‌ చేతుల్లో ఉంటుందని నీతులు మాట్లాడారు.మరి నేడు చంద్రబాబు మనిషి ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తే ఎందుకు అరుస్తున్నాడని ప్రశ్నిస్తున్నా..ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌పై కోర్టుకు వెళ్లడమా...చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్‌ చేస్తాడంట..ఎవరినైనా తోలుతీస్తా,తాట తీస్తా అంటాడు. జగన్‌బాబును అసెంబ్లీలో అంతుచూస్తాడంట..ఇదే చంద్రబాబు..వైయస్‌ఆర్‌ మరణించక రోజులు ముందు నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతావని వైయస్‌ఆర్‌ను చంద్రబాబు అన్నారు.

ఎవరైనా ఎదైనా చేస్తాడు.అక్కాచెల్లెమ్మలు నన్ను రక్షించండి అనేవాడు మిమ్మలి ఏవిధంగా కాపాడతాడు.17 కేసుల్లో స్టే తెచ్చుకుని ఇష్టమొచ్చినట్లు ఎలక్షన్‌ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు.జగన్‌బాబుపై 31 కేసులు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నాడు..ఆ కేసులు ఎవరూ పెట్టారు చంద్రబాబు పెట్టినవి కాదా అని ప్రశ్నిస్తున్నా..చంద్రబాబు తన కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు..వైయస్‌ జగన్‌పై కేసులపై పోరాడుతున్నారు. ఎవరికి నిజాయతీ ఉందో ప్రజలే చెప్పాలి.చంద్రబాబు ఎన్ని తప్పులయినా చేస్తాడు.గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని  తమ ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది.మన వ్యక్తిగత సమాచారం అంతా బయటపెట్టాడు.వైయస్‌ఆర్‌సీపీ చెందిన లక్షల ఓట్లు తొలగించలేదా అని అడుగుతున్నా..చంద్రబాబు బీజేపీలో ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు..మూడు నెలల నుంచి రాహుల్‌తో జతకట్టాడు..నేడు జగన్,బీజేపీ,కేసీఆర్‌ అంటున్నాడు.ప్రజల ఒకసారి గమనించాలి. జగన్‌ ఏ రోజు బీజేపీతో కలవలేదు..కాంగ్రెస్‌తో కలవలేదు.కేసీఆర్‌తో కూడా కలవలేదని చెబుతున్నాను.జగన్‌బాబుకు మోదీ,కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు.

టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి వైయస్‌ జగన్‌పై అనేక కుట్రలు చేసి జైలుకు పంపించారు. ఆ రోజే వైయస్‌ జగన్‌ భయపడలేదు..జగన్‌బాబు ఎవరికి తలొగ్గరు.వైయస్‌ జగన్‌ ఒక్కటే కోరుకుంటున్నారు.మన రాష్ట్రం బాగు పడాలంటే ప్రత్యేకహోదా కావాలి.ఉద్యోగాలు,పరిశ్రమలు,రాయితీలు వస్తాయన్నారు.ప్రత్యేకహోదా రాష్ట్రానికి అవసరమన్నారు.ప్రత్యేకహోదా రాష్ట్రానికి ఇస్తామని బీజేపీ,కాంగ్రెస్‌లు మోసం చేశాయన్నారు.25 మంది ఎంపీలు గెలిపించుకోవాలన్నారు. మనకు ప్రత్యేకహోదా ఎవరి ఇస్తే వారికే మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ తెలిపారన్నారు.వైయస్‌ జగన్‌కు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవలసిన అవసరంలేదు. పొత్తు  పెట్టుకుంటే అది ప్రజలతోనే..రాష్ట్ర ప్రజానీకంతోనే వైయస్‌ జగన్‌కు అనుబంధం.కేసీఆర్‌ పెత్తనం సహించొద్దు..కేసీఆర్‌ను ఓడించండి అని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు.

కేసీఆర్‌కు, మన రాష్ట్రానికి సంబంధం ఏమిటీ..కేసీఆర్‌లో ఏపీలో పోటిచేస్తున్నారా..కేసీఆర్‌తో మనం కలిసి పోటీ చేస్తున్నామా..తెలుగు ప్రజల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారు.చంద్రబాబు స్వలాభం కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.వైయస్‌ జగన్‌ ఒక్కటే కోరుకుంటున్నారు. ఆయన తండ్రిలాగా రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టాలనే సంకల్పంతో ఉన్నారు.రాజన్న రాజ్యం తెచ్చుకుందాం.నవరత్నాలు ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలని వైయస్‌ జగన్‌ తాపత్రాయపడుతున్నారు.రెండు సంవత్సరాలు నుంచి నవరత్నాలను ప్రకటిస్తున్నారు.మా రాజన్న బిడ్డ అని మీరు గొప్పగా చెప్పుకునే స్థితిలో మిమ్మల్ని నిలబెడతారు.గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స అప్పలనరసయ్య,ఎంపీ అభ్యర్థిగా బెల్లాల చంద్రశేఖర్‌ నిలబడ్డారు. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా..

 

Back to Top