తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (11.06.2025) ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్తున్న వైయస్ జగన్.. పొదిలి పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పొదిలి చేరుకుంటారు, అక్కడ పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు, అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.