గుంటూరు: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగళ్ మృతిపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ‘‘భారతీయ చిత్రసీమలో ఒక లెజెండ్ శ్యామ్ బెనగల్(Shyam Benegal). చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన కృషి లక్షలాది మంది దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్ బెనెగల్.. ఎన్నో కళాత్మకచిత్రాలను తెరకెక్కించారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నిన్న(డిసెంబర్ 23, 2024) సాయంత్రం 6గంటల 38నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ.శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో పూర్తయ్యాయి.