ఆళ్లనాని ఆకస్మిక మృతిపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి

తాడేప‌ల్లి: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని పనిచేశారు.
 

Back to Top