ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల మాజీ ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా, టీడీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ దంపతులు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు వ్యవహారశైలి నచ్చకే వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు పాలడుగు దుర్గాప్రసాద్ దంపతులు తెలిపారు. వారి చేరికతో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వైయస్ఆర్‌సీపీకి మరింత బలం చేకూరిందని జోగి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.