రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర 

రాస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

వైయస్‌ జగన్‌ ఫైర్‌

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం

అందుకే యథేచ్ఛగా అక్రమాలు, ఉల్లంఘనలు

వైయస్‌ జగన్‌ ధ్వజం 

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరసగా మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల హింసాకాండ. 
అభ్యర్థులపై అక్రమ కేసులు.  అరెస్టులు. టీడీపీ గుండాల దాడి. వైయస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు 
వేయకుండా నిరోధించడం. వారి నామినేషన్‌ పత్రాలు చించేయడం. వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ 
మిథున్‌రెడ్డిపై పుంగనూరులో హత్యాయత్నం. పులివెందులలో పోలీసుల బాష్పవాయు ప్రయోగం. గాలిలోకి 
కాల్పులు. తదితర అంశాలపై సాక్ష్యాధారాలతో సహా మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌.

స్థానిక ఎన్నికల నిర్ణయం నుంచే కుట్రల అమలు

ఏకపక్షంగా వార్డుల విభజన. రిజర్వేషన్లు ఖరారు

ఆ తర్వాత ఒకేరోజులో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన

నామినేషన్లకు కేవలం మూడు రోజులే గడువు

 వైయస్‌ జగన్‌ వెల్లడి

నామినేషన్ల పర్వంలో మూడ్రోజులు అరాచకాలు

వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు. అడ్డగింత

నామినేషన్లు దాఖలు చేయకుండా నిరోధిస్తున్నారు

అభ్యర్థులపై అక్రమంగా కేసులు. అరెస్టులు

బైండోవర్లతో భయపెడుతున్న పోలీసులు

అయినా ఎక్కడా వెనక్కి తగ్గబోము. నిలబడతాం

ప్రజల పక్షాన పోరాడతాం. వారికి అండగా ఉంటాం

వైయస్‌ జగన్‌ ప్రకటన 

మాకూ టైమ్‌ వస్తుంది. ఎవ్వరినీ వదిలి పెట్టబోము

తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకొండి

ఎస్‌ఈసీ ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలి

ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. ఏకపక్ష వైఖరి సరికాదు

తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌ 

ఈ వ్యవస్థల్లో మార్పులు రావాలి

సీఈసీ. ఎస్‌ఈసీ ఎంపిక విధానం మారాలి

వారి నియామకాలు ఏకపక్షంగా జరగకూడదు

సీజేఐ, విపక్షనేత, ప్రధాని కలిసి సీఈసీని నియమించాలి

హైకోర్టు సీజే, సీఎం, విపక్షనేత కలిసి ఎస్‌ఈసీని నిర్ణయించాలి

అప్పుడే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుంది

ఈ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా కీలకం

ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర కొనసాగుతోందని, దాన్ని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు రాస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. 
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్న సీఎం చంద్రబాబు యథేచ్ఛగా అక్రమాలు, ఉల్లంఘనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే కుట్రల అమలు చేస్తున్నారన్న ఆయన, ఆ దిశలోనే ఏకపక్షంగా వార్డుల విభజన. రిజర్వేషన్లు ఖరారు చేశారని, ఆ తర్వాత ఒకేరోజులో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారని, నామినేషన్లకు కేవలం మూడు రోజులే గడువు ఇచ్చారని వెల్లడించారు.
    నామినేషన్ల పర్వంలో వరసగా మూడ్రోజులుగా అరాచకాలు చేస్తున్నారన్న శ్రీ వైయస్‌ జగన్, వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని.. మరోవైపు అభ్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేస్తున్న పోలీసులు.. బైండోవర్లతోనూ భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. అయితే ఎక్కడా వెనక్కి తగ్గబోమని, గట్టిగా నిలబడతామని, ప్రజల పక్షాన నిలబడతామని, వారికి అండగా ఉంటామని పోరాడతామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

అధర్మ చరిత్ర. రక్తచరిత్ర రాస్తున్న చంద్రబాబు:
    అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. చట్టం, న్యాయం ఎక్కడైనా మచ్చుకు కనిపిస్తుందా? ఒకసారి అందరూ ఆలోచించాలి. ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, నామినేషన్‌ కేంద్రాలకు వెళ్తే, వాటిని వేయనీయకుండా అడ్డు తగలడం, టీడీపీ మూకలు ముందుగానే అక్కడే ఉండడం, పోలీసులు వారికి సహకరించడం, చివరకు అధికారులు కూడా నామినేషన్‌ పత్రాలు తీసుకోవడానికి నిరాకరించడం.. గతంలో ఎప్పుడూ చూడలేదు.
    ఇది కేవలం వెన్నుపోటు పార్టీ నాయకుడు, గొడ్డళ్లు సరఫరా చేసే నాయకుడు చంద్రబాబునాయుడి హయాంలో మాత్రమే సాధ్యం. అలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధర్మ చరిత్ర, రక్త చరిత్ర రాస్తున్నాడు.
    కనీసం నామినేషన్‌ వేయడానికి కూడా అనుకూల పరిస్థితి లేకపోతే, అసలు నామినేషన్లు వేయకుండా అడ్డు తగిలితే, ప్రభుత్వమే స్వయంగా దీన్ని ప్రోత్సహిస్తే.. ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్‌) అనేది కేవలం చంద్రబాబుగారి ఎక్స్‌టెన్షన్‌ గవర్నమెంట్‌గా ఉంటే, అసలు ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుందా?. ఆలోచించండి.

స్థానిక ఎన్నికల ప్రక్రియంతా కుట్రపూరితం:
    రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎంత కుట్రపూరితంగా జరుగుతున్నాయనేది చూస్తే.. అడ్డగోలుగా వార్డులు విభజించారు. ఇష్టానుసారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అవి వెల్లడించిన రెండో రోజే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ. అందుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చారు.
    అధికార పార్టీకి రిజర్వేషన్ల గురించి ముందే తెలుసు కాబట్టి, ముందే సిద్ధమయ్యారు. ప్రతిపక్షానికి ఆ అవకాశం లేదు. అయినా విపక్షం సిద్ధమైతే, నామినేషన్లు వేయనీయడం లేదు.
    ఈ సందర్బంగా నేను చంద్రబాబుగారిని ఒకటే అడుగుతున్నాను.
మీకు నిజంగా ప్రజల మద్దతు ఉందని భావిస్తే, నామినేషన్లు ఎందుకు వేయనీయడం లేదు? పోలీసులతో అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఎందుకు మా పార్టీ వారిపై దాడి చేస్తున్నారు?.
    నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వెళ్తే, వారికి తోడుగా నిలబడి సహకరించాల్సింది పోయి, పోలీసులు వారిపై కాల్పులు జరపడం, లాఠీఛార్జ్‌ చేయడం ఏమిటి? గతంలో ఎప్పుడైనా చూశామా ఇవన్నీ. అందరి సమక్షంలో నామినేషన్‌ పత్రాలు లాక్కోవడం. అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు తీసుకోకపోవడం.. గతంలో ఏనాడైనా జరిగిందా?.
    అసలు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే, చంద్రబాబు కుట్రలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చారు. ఓటర్ల తుది జాబితా వస్తుందని తెలుసు. అయినా అది రాక ముందే, చెల్లని ఆ ఓట్లతో ఎన్నికలకు పోవడంతోనే కుట్ర మొదలైంది.

ఇష్టానుసారం మార్పులు. చేర్పులు:
    ఇష్టానుసారంగా డివిజన్లు విభజించారు. విశాఖపట్నం చూస్తే కొన్ని వార్డుల్లో కేవలం 5 వేల ఓట్లు ఉంటే, మరి కొన్నింటిలో 30 వేల ఓట్లు ఉన్నాయి. పూర్తిగా వారిని అనుకూలంగా డివిజన్లలో మార్పులు, చేర్పులు చేశారు. వైయస్సార్‌సీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న వార్డులను చీల్చారు. ఓటరు ఉన్న చోట ఉన్న పోలింగ్‌ కేంద్రంలో కాక మరో కేంద్రానికి ఆ ఓటు మార్చారు.  ఇంకొక పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటట్టుగా చేశారు.
    అలాగే ఇష్టానుసారం వాళ్లకు అనుకూలంగా రిజర్వేషన్‌ తీసుకొచ్చారు. వీళ్ళకి కావాల్సిన చోట వీళ్ళకి కావాల్సిన విధంగా రిజర్వేషన్‌ ఖరారు చేశారు.

చంద్రబాబుకు ఓటమి భయం:
    ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినా కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే పోలీసులను అడ్డు పెట్టుకొని బైండ్‌ ఓవర్‌ పేరుతో అభ్యర్థులను పిలుస్తున్నారు. దొంగ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. 
    ఇంకా ఈ ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో తన భాగస్వామ్య పార్టీలకు చంద్రబాబునాయుడు గారే తన పార్టీ నుంచి టెంట్‌ సామాన్లు సరఫరా చేసినట్టుగా, తన పార్టీకి చెందిన వారిని ఆ పార్టీలోకి పంపి, అక్కడ వారి పేరుతో టికెట్లు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. 
    ఎన్నికలు సజావుగా జరిగితే, గెలుస్తామన్న ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబునాయుడుగారు నారాసుర రక్త చరిత్ర రాస్తూ స్థానిక ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా దారుణ హింసను ప్రోత్సిహిస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెల్చేందుకు అన్ని అక్రమాలు చేస్తున్నాడు.
    మామూలుగా ఏ పోలీస్‌ అధికారినైనా రెండేళ్ల తర్వాత బదిలీ చేస్తారు. కానీ, కొందరిని చంద్రబాబు ఏళ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నాడు. అలా ఒక సిండికేట్‌గా వారిని తయారు చేశాడు. పై స్థాయి నుంచి కింది వరకు. ఇసుక మొదలు మద్యం వరకు మాఫియా. ప్రతి చోటా దోపిడి. చినబాబుకు ఇంత. పెదబాబుకు ఇంత. ఎమ్మెల్యేకు ఇంత అని ఇస్తున్నారు. చివరకు ఎన్నికలప్పుడు కూడా వారినే కొనసాగించి, మాఫియా రాజ్యం ఏలుతున్నారు.

గతి తప్పిన పోలీస్‌ వ్యవస్థ:
    రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. నామినేషన్‌ సెంటర్‌ దగ్గర వందలాది వెన్నుపోటు పార్టీ గుండాలు మారుణాయుధాలతో గుమిగూడినా పోలీసులు ఏమి చేయడం లేదు. అస్సలు పట్టించుకోరు. ఇదంతా కళ్ళ ముందే కనిపిస్తోంది. 
    నామినేషన్‌ వేసేటప్పుడు ఆ సెంటర్‌లోకి అభ్యర్థితో సహా, కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. కానీ, ఆ నామినేషన్‌ సెంటర్లలో వెన్నుపోటు పార్టీ వారు వందల సంఖ్యలో మారుణాయుధాలతో గుమి గూడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మరోవైపు మా పార్టీ వారు నిబంధనల ప్రకారం నలుగురితో వెళ్ళిన పోలీసులు ఒప్పుకోవడం లేదు. తీరా కష్టపడి అక్కడికి వెళ్తే వెంటనే వెన్నుపోటు పార్టీ వాళ్ళు మా వాళ్ళ మీద పడి దాడులు చేసి నామినేషన్‌ పత్రాలను లాక్కుంటున్నారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా పోలీసులు ఏమి చేయరు. పైగా వారికి సహకరిస్తారు.
    ఎలాగోలా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) రూమ్‌ వరకు వెళ్లి నామినేషన్‌ పత్రాలు ఇస్తే అక్కడకు కూడా వెన్నుపోటు పార్టీ రౌడీలు వెళ్ళిపోయి అధికారుల చేతుల్లో నుంచి ఆ పత్రాలు లాగేసుకుంటున్నా పోలీసులు మాత్రం మాట్లాడరు.
    ఇదే చంద్రబాబుగారిని అడుగుతున్నా. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి వెళ్తే, పోలీసులు ఫైర్‌ చేయడం ఏమిటి? మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అలా వ్యవహరించడం ఏమిటి? గతంలో ఎక్కడైనా ఇలా చూశామా? నామినేషన్‌ వేయడానికి వెళ్లిన అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం. ఫైర్‌ చేయడం.

డీజీపీ, హోం సెక్రటరీ నిద్ర పోతున్నారు:
    ఏకంగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ)లే నామినేషన్‌ పత్రాలు తీసుకోవడం లేదంటే.. దాడులకు వాళ్లే అవకాశాలు కల్పిస్తున్నారంటే..  దానికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే.. ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కి తెలిసినా స్పందించడం లేదంటే.. డీజీపీ, హోం సెక్రటరీ ఇద్దరూ నిద్ర పోతున్నారంటే.. ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా?. ఒకసారి గమనించమని కోరుతున్నాను.

మా హయాంలో ఎన్నికలు ఎలా జరిగాయి?:
    గతంలో మా హయాంలోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాం. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఎవరో తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నాను. అప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌. ఆయన వెన్నుపోటు పార్టీకి అత్యంత సానుభూతిపరుడు. 2024 ఎన్నికల్లో మీరు గమనిస్తే ఆయన వెన్నుపోటు పార్టీ కోసం కాళ్లకు బలపం కట్టుకుని మరీ తిరిగాడు.
    అటువంటి సానుభూతిపరుడు ఎస్‌ఈసీగా ఉండగా, ఆయన ఆధ్వర్యంలో మేము స్థానిక ఎన్నికలు నిర్వహించాము. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగానే, మొత్తం అధికారం తన చేతుల్లోకి వచ్చేసింది కదా అని చెప్పి.. చిత్తూరు కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్, గుంటూరు కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్, గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కమిషనర్‌ ట్రాన్స్‌ఫర్, ఎస్పీ తిరుపతి ట్రాన్స్‌ఫర్, డీఎస్పీ పలమనేరు, శ్రీకాళహస్తి ట్రాన్స్‌ఫర్, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి ట్రాన్స్‌ఫర్‌. ఇంకా చిత్తూరు జిల్లాలో ఎంపీడీఓల మూకుమ్మడి బదిలీ. అలా ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినా.. ఆరోజు వైయస్సార్‌సీపీ గెలుపు చూస్తే..
    13 మున్సిపల్‌ కార్పొరేషన్లకు మొత్తం 13 వైయస్సార్‌సీపీ స్వీప్‌ చేసింది. ఆ కార్పొరేషన్లలో 724 డివిజన్లు ఉంటే వాటిలో 616 డివిజన్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అంటే 85% డివిజన్లు. ఇంకా ఎన్నికలు జరిగిన 86 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అంటే 98% మున్సిపాలిటీలు మా కైవసం. మొత్తం 2,397 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 1,939 వార్డులు గెలుచుకుంది, అంటే 81% వార్డులు గెలుచుకుంది. అలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 99 పట్టణ స్థానిక సంస్థల్లో, వైఎస్సార్‌సీపీ 97 స్థానిక సంస్థలను గెలుచుకుంది.

మరి అదెలా సాధ్యమైంది?:
    అలాంటి ఎస్‌ఈసీ ఉన్నప్పుడు కూడా వైయస్సార్‌సీపీ ఆ విజయం ఎందుకు సాధించిందంటే, మ్యానిఫెస్టోలో మా పార్టీ చెప్పిన వాటిలో, ఆ ఎన్నికల నాటికే 95 శాతం అమలు చేసింది. ఏకంగా రాష్ట్రంలో ఎవరూ చూడని మార్పులు తీసుకొని రాగలిగినాం కాబట్టే వైఎస్సార్‌సీపీకి ఆ రకమైన తీర్పును ప్రజలు ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం.
    గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వాలంటీర్‌ వ్యవస్థ. ప్రతి పథకమూ పారదర్శకంగా అమలు. లంచానికి అవకాశం లేకుండా, వివక్షకు తావు లేకుండా ఇంటి గడప వద్దే పథకాలు అందించాం. 
    ఇంకా ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా స్కూళ్లు మారాయి. ప్రైవేట్‌ స్కూళ్లు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్‌ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ చూడని విధంగా వైద్య, విద్య రంగాల్లో మార్పులు. గ్రామాల్లోని విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీల రూపురేఖలు మారాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వచ్చింది. నాడు–నేడుతో హాస్పిటళ్ల రూపురేఖలు మారాయి. విద్య, వైద్యం, వ్యవసాయం. పారదర్శక ప్రభుత్వం. పాలనలో పూర్తి పారదర్శకత. అలా ఎవరూ చూడని విధంగా మార్పులు జరిగాయి కాబట్టి అప్పుడు ఆ రకమైన ఫలితాలు వచ్చాయి.
    అమ్మఒడి అయితేనేమి, విద్యాకానుక అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతులకు సున్నా వడ్డీ అయితేనేమి, ఉచిత పంటల బీమా అయితేనేమి, మహిళలకు ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, కాపునేస్తం అయితేనేమి, మత్స్యకార భరోసా అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, లా నేస్తం అయితేనేమి, చేదోడు అయితేనేమి, తోడు అయితేనేమి, పెన్షన్‌ కానుక అయితేనేమి, వైఎస్సార్‌ విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి.. వాటన్నింటితో పాటు, నా అక్కచెల్లెమ్మలందరికీ ఇళ్లపట్టాలు, ఇళ్లు కట్టించి ఇవ్వడమైనేమి. ఏకంగా చరిత్రలో చూడని విధంగా 31 లక్షల ఇళ్లపట్టాలు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 22 లక్షల ఇళ్లు కట్టడానికి మొదలుపెట్టిన పరిస్థితులు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఇవన్నీ జరిగాయి కాబట్టే ఆరోజు ఆ ఫలితాలు వచ్చాయి.

ఇప్పుడంతా మోసం:
    ఈరోజు చంద్రబాబునాయుడుగారి పరిస్థితి ఏమిటి? సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు గాలికి ఎగిరిపోయినాయి. ప్రజలందరూ అవి మోసాల కింద తేల్చేశారు. ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. ‘సినిమా స్టార్ట్‌ ఇన్‌ జూన్‌ 2024 అని’ చెప్పారు. ఆ బాండ్లు చూపించి ప్రజలు నిలదీసే పరిస్థితి ఈరోజు చంద్రబాబునాయుడి పార్టీకి ఉంది. సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు చేయకుండానే, ఏకంగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. అన్నీ చేశామని చెప్పి ప్రజలను ఆ మాదిరిగా బుల్డోజ్‌ చేస్తే ప్రజలేం పిచ్చోళ్లు కాదు. ‘సరే నువ్వు బుల్డోజ్‌ చేస్తావు, మేము ఓటు రూపంలో చూపిస్తాం’ అని చెప్పి ప్రజలు గట్టిగా నిలదీసే కార్యక్రమం జరుగుతుంది.
    మరోవైపు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం. ఎక్కడ చూసినా అవినీతి. ఎక్కడ చూసినా వివక్ష. ఆ వివక్షతో పాటు అరాచకం. ఇదీ చంద్రబాబునాయుడు మార్క్‌ రాజకీయం. అదే ఈరోజు కనిపిస్తోంది. అందుకే ఈ ఎన్నికలపై చంద్రబాబునాయుడికి ధైర్యం లేదు.

చంద్రబాబుకి ఆ ధైర్యం లేకనే..:
    ఈ ఎన్నికలు సజావుగా జరిపే ధైర్యం చంద్రబాబుకు ఏ మాత్రం లేదు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. దాడులను ఎదుర్కొని మా పార్గీ వారు ఎలాగోలా ఆర్వో దగ్గరకు వెళ్లినా నామినేషన్లు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఏం జరుగుతోంది అనేది మీకు కొని చూపిస్తాను. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇది ధర్మమేనా, న్యాయమేనా అనేది మీతో పాటు, ప్రజలూ ఆలోచించాలని కోరుతున్నాను. 

వాస్తవాలు. ట్విస్ట్‌ వ్యవహారాలు:
    వాస్తవాలను ఎలా ట్విస్ట్‌ చేస్తున్నారో చూడండి. చంద్రబాబునాయుడుగారు, ఆయన ఎల్లో మీడియా.. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5.. ఆయనకు సంబంధించిన సోషల్‌ మీడియా.. అంతా కలిసి ట్విస్ట్‌ చేయడం ధర్మమేనా అని అడుగుతున్నాను. 
    పుంగనూరు దాడి ఘటనను ట్విస్ట్‌ చేయడానికి ధ్వంసమైన కార్లలో లిక్కర్‌ బాటిల్స్‌ పెట్టారు. దాడిలో ఆ కార్లు తిరగబడిపోయాయి. కానీ లిక్కర్‌ బాటిళ్లు మాత్రం నిటారుగా నిలబడి ఉన్నాయి! కార్లలో సీట్లు ఇతర సామాగ్రి కూడా తిరగబడ్డాయి. కానీ అక్కడా బాటిళ్లు మాత్రం నిటారుగా ఉన్నాయి. అంఏ వీళ్లే బాటిళ్లు పెట్టి, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ, కార్లను ధ్వంసం చేయించి, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. 
    చివరకు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లినా ఆర్వో తీసుకోకుండా మూడు గంటలు వెయిట్‌ చేయించి పంపించారు. అంతే కాకుండా, మిథున్‌ మీద రివర్స్‌ కేసులు పెట్టారు. అసలు మిథున్‌ టీ–టోట్లర్‌ (మద్యం సేవించని వ్యక్తి). ఆయనకు మందు తాగే అలవాటే లేదు. నా మాదిరిగానే ఆయనకూ ఆ అలవాటు లేదు. ఒక టీ–టోట్లర్‌ కార్లో లిక్కర్‌ బాటిళ్లు ఉన్నాయని సృష్టిస్తున్నారు.
    పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మా పార్టీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించడానికి వెళ్తే అన్ని అడ్డంకులు సృష్టించారు. పోలీసులు ఇలా సాక్ష్యాలను తారుమారు చేస్తూ ఉంటే, వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో అందరూ ఆలోచించాలి.

ఇదీ ఇప్పటి ఎస్‌ఈసీ చరిత్ర!:
    ప్రజాస్వామ్యబద్ధంగా మేము నామినేషన్లు వేస్తాము అని అంటే కనీసం నామినేషన్లు తీసుకోలేని పరిస్థితి ఉంటే.. ఇదే ఎస్‌ఈసీ.. అనిల్‌చంద్ర పునేఠ. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌ చంద్ర పునేఠ ఎవరు? 2019లో చంద్రబాబునాయుడుగారు ఈయనను చీఫ్‌ సెక్రటరీగా పెట్టుకుంటే, ఎన్నికలు జరిగేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం, ఈ చీఫ్‌ సెక్రటరీని, ముగ్గురు అధికారులను ఎన్నికల విధిలో నుంచి తీసేయమని ఆదేశించింది. అప్పుడు ఇదే అనిల్‌ చంద్రపునేఠ.. ఆ ముగ్గురు అధికారుల్లో ఒక పోలీసు అధికారి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ను రద్దు చేసి మళ్ళీ పిలిపించుకున్నాడు. దీన్ని అప్పటి ఎస్‌ఈసీ తప్పు పడితే, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా దానికి ఒప్పుకోలేదు. దీంతో అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆ చీఫ్‌ సెక్రటరీ (అనిల్‌ చంద్ర పునేఠ)ను తొలగించింది. 
    అంటే అనిల్‌చంద్ర పునేఠ, చంద్రబాబునాయుడుకు సపోర్ట్‌ చేయడంలో అంత కరుడు గట్టిన, తీవ్రవాది లాంటి ఈ మనిషి. ఇలాంటి ఆయన్ను, రిటైర్మెంట్‌ తర్వాత చంద్రబాబునాయుడుగారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. అలాంటి ఆయన నేతృత్వంలో ఈరోజు  స్థానిక ఎన్నికలు జరుగుతునానయి.
    అదే ఆరోజు మేము నిమ్మగడ్డ రమేష్‌ వంటి చంద్రబాబు లాయల్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే, ఈరోజు చంద్రబాబు తన లాయల్టీ అయిన అనిల్‌చంద్ర పునేఠ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపిస్తున్నాడు. ఇక ఏ విధంగా న్యాయం జరుగుతుంది?.

నామినేషన్ల పర్వంలో మూడు రోజుల్లో..:
    పుంగనూరులో మొన్న (శుక్రవారం) ఉదయం మా పార్టీకి చెందిన అభ్యర్థులతో కలిసి, మా ఎంపీ నామినేషన్‌ సెంటర్‌కు వెళ్తే, టీడీపీ వాళ్ళు నామినేషన్‌ కేంద్ర పరిధిలోనే దారుణమైన దాడులు చేశారు. మిథున్‌పై హత్యాయత్నం చేశారు. మిథున్‌కు సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీ ఉంది. దీంతో వారు గాలిలో కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మిథున్‌ సెక్యూరిటీకి ప్రాణహాని జరిగేంతగా దెబ్బలు తగిలాయి.
    ఆ తర్వాత ఎలాగోలా ఆర్‌ఓ కేంద్రానికి చేరుకున్న మిధున్‌రెడ్డి, అక్కడ మూడు గంటలు వేచి చూసినా, ఆ అధికారి (ఆర్వో) నామినేషన్‌ తీసుకోవడానికి నిరాకరించారు.
(అంటూ పుంగనూరులో జరిగిన దాడి ఘటనల వీడియో పీపీటీలో చూపారు)
ఇక్కడ ప్రధాన అంశాలు.
1. అంత మంది అక్కడ గుమి గూడడానికి పోలీసులు ఎలా అనుమతించారు?.
2. కార్లను ధ్వంసం చేసిన తర్వాత వాటిలో మద్యం బాటిళ్లు పెట్టారు. కారు తిరగబడినా, ధ్వంసమైనా మద్యం బాటిళ్లు నిటారుగా ఉన్నాయి.
3. ఎలాగోలా లోపలికి వెళ్లినా, 3 గంటలు వేచి చూసినా, నామినేషన్లు తీసుకోలేదు?.
4. మిథున్‌ మద్యం సేవించడు. ఆయన కారులో మద్యం బాటిళ్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు.
    పోలీసులే ఇలా మద్యం బాటిళ్లు పెట్టి, దుష్ప్రచారం చేస్తుంటే ఎలా?.

శాప్‌ ఛైర్మన్‌ బహిరంగంగా మాట్లాడినా..!:
    అదే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో) ఉన్న నామినేషన్‌ కేంద్రం వద్ద.. శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు వాహనం ఎక్కి, పోలీసుల మైక్‌ తీసుకుని, దాడులు చేస్తామని మాట్లాడుతున్నా.. పోలీసులు చూస్తూ ఊర్కున్నారు.
(అంటూ ఆ వీడియో పీపీటీలో చూపారు)
    అది నామినేషన్‌ కేంద్రం. అయినా అక్కడ ఆయన అలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

వెన్నుపోటు పార్టీ గుండాగిరి. ఇవీ ఘటనలు.
మహిళలపైనా దాడి. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి:
    అదే పుంగనూరులో వైయస్సార్‌సీపీ పక్షాన నామినేషన్‌ వేయడానికి 9వ వార్డు నయాజ్‌ తన భార్యతో కలిసి వెళ్తే, పోలీసుల సమక్షంలోనే ఆయన్ను కొట్టి నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. అయినా పోలీసులు నియంత్రించలేదు. వారికి సహకరించారు.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు).
    తిరుపతిలో మా పార్టీ మేయర్‌ అభ్యర్థి వాసూ యాదవ్‌. నామినేషన్‌ వేయడానికి వెళ్తే, చంపేస్తామని బెదిరించారు. ఆయన వెంట మా పార్టీ ఎంపీ గురుమూర్తి వెళ్తే, ఆయన్ను కూడా అడ్డుకున్నారు. ఇంకా ఆ పోలీసులే టీడీపీ మూకలు దాడి చేసి, వారి చేతి నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కునేలా చేశారు.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు. అందులో ఎంపీ ఎం.గురుమూర్తి వీడియో వాయిస్‌ కూడా ఉంది).
    మళ్లీ మధ్యాహ్నం కూడా గురుమూర్తి వెళ్తే, అప్పుడు కూడా నామినేషన్‌ వేయనీయలేదు. చివరకు ఎస్పీని సెక్యూరిటీ కోరినా, ఎస్పీ పట్టించుకోలేదు.
(అంటూ, వైయస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతో ఎస్పీని వేడుకుంటున్న ఫోటో చూపారు).
    పోలీసులు ఎందుకింతగా వాచ్‌మెన్లుగా మారారు? ప్రజల కోసం కాకుండా, చంద్రబాబు వేసే బిస్కట్ల కోసం పని చేస్తున్నారు.
    తిరుపతిలో మా మేయర్‌ అభ్యర్థి వాసూ యాదవ్, నిన్నటి నుంచి తన అమ్మతో కలిసి కూర్చుని ఆందోళన చేస్తున్నాడు. వర్షంలో తడిసి కూడా ఆ ఆందోళన.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు. అందులో ఆయన తల్లి మాటల వీడియో ప్రదర్శన).
    మరోవైపు కడప కార్పొరేషన్‌. నామినేషన్‌ వేయడానికి వెళ్తే దాడులు చేశారు. కత్తులతో పొడిచారు. మాజీ కార్పొరేటర్‌ కుమారుడు మురాద్‌ను అలా కత్తితో పొడిచారు.
(అంటూ ఆ వీడియో కూడా పీపీటీలో చూపారు)

మహిళలనూ వదల్లేదు:
    ఇంకా నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థులపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారు. చివరకు మహిళలను కూడా వదల్లేదు.
మాజీ డిప్యూటీ మేయర్‌. తన మరదలు నామినేషన్‌ వేయడానికి తీసుకెళ్తే, ఆయన్ను కత్తితో పొడిచారు. నామినేషన్‌ వేయడానికి వస్తే, చంపేస్తామని కడప ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగా బెదిరించాడు.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు).


    ఇన్ని జరుగుతుంటే.. ఏం చర్యలు తీసుకున్నారు? ఎస్‌ఈసీ ఏం చేస్తోంది? పోలీసుల సమక్షంలోనే అన్నీ జరుగుతున్నాయి? ఎవరిని అరెస్టు చేశారు? అన్నీ పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారు.
    బద్వేలులో మా పార్టీ వారు మొన్న వేసిన నామినేషన్లను, నిన్న ఆర్వో ఆఫీసులోకి చొరబడి, వాటిని తీసుకుని చింపేశారు.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు)
    ఇది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. వారు దగ్గరుండి సహకరించారు.
    రాజంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి. బీసీ మహిళ. ఆమె నామినేషన్‌ వేసి తిరిగి వస్తుండగా, దారుణంగా ఆమెపై, ఆమె తండ్రిపై దాడి చేశారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఇంటిపైనా దాడి చేశారు.
(అంటూ, ఆ వీడియోలు కూడా చూపారు. మేయర్‌ అభ్యర్థి తండ్రి వీడియో చూపారు)
    మహిళల మీద కూడా ఇలా దాడి చేయించడానికి చంద్రబాబుకు నిజంగా సిగ్గుందా? ఇదేనా మహిళలకిచ్చే గౌరవం. మహిళలకు ఎప్పుడో కానీ, అవకాశాలు రావు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.
    మరోవైపు దర్శిలో వైయస్సార్‌సీపీ వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
(అంటూ ఆ వీడియో కూడా చూపారు)

పులివెందులలో పోలీసులే గుండాలుగా మారారు:
    ఇప్పటిదాకా మనం చూసింది.. టీడీపీకి పోలీసులు సహకరించారు.
పులివెందుల దగ్గరకు వచ్చేసరికి, పోలీసులే గుండాల్లా మారారు. నిన్న (శనివారం) ఉదయం నుంచే వైయస్సార్‌సీపీ వారు నామినేషన్లు వేయకుండా, టీడీపీ గుండాలను మొహరించారు. వారికి పోలీసుల సహకారం ఇచ్చారు. పరిస్థితిని ఎస్పీ, డీఐజీ దృష్టికి ఎంపీ అవినాష్‌రెడ్డి వివరిస్తే, మధ్యాహ్నం 1.30 కి వచ్చి, నామినేషన్లు వేసుకోమని చెప్పారు.
    దాంతో ఆ టైమ్‌కు అవినాష్‌రెడ్డి వెళ్తే, పోలీసులే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్‌ చేయడమే కాకుండా, పోలీసులు స్వయంగా ఏకే–47తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇలా పోలీసులే కార్లు ధ్వంసం చేశారు. పోలీసులే రాళ్లు విసిరారు. 
(అంటూ ఆ మొత్తం వీడియోలు చూపారు).
    ఇలా పోలీసులే టీడీపీ గుండాల పాత్ర పోషించారు.

రాయచోటిలో విధ్వంసం:
    రాయచోటిలో మా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మా పార్టీ ఆఫీస్‌లో ఉండగానే, ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. బయట ఉన్న వాహనాలు కూడా తగలబెట్టారు.
(అంటూ ఆ మొత్తం వీడియోలు కూడా చూపారు)
    అక్కడ మా పార్టీ ఛైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌పై వరసగా మూడు రోజుల నుంచి దాడి చేస్తున్నారు.

ప్రెస్‌మీట్‌ జరుగుతున్న సమయానికి నామినేషన్ల పరిస్థితి ఇదీ..:
    తిరుపతి కార్పొరేషన్‌కు ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. కాసేపటి క్రితం మేయర్‌ అభ్యర్థి అతి కష్టం మీద నామినేషన్‌ వేయగలిగాడు. రాత్రి నుంచి దీని కోసం ఆయన ఆందోళన చేశాడు. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉంటే, 10 డివిజన్లలో మాత్రమే నామినేషన్లు పడ్డాయి. పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు 22 వార్డులకు మాత్రమే నామినేషన్లు పడ్డాయి. మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేశారు. బద్వేలు మున్సిపాలిటీలో 40 వార్డుల్లో ఇంకా 14 వార్డులకు నామినేషన్‌ వేయాలి. నిజానికి అక్కడ  మొన్న (శుక్రవారం) వేసిన నామినేషన్‌ పత్రాలన్నీ చింపేశారు. 
    కమలాపురం మున్సిపాలిటీలో చైర్మన్‌ సహా ఇప్పటివరకు ఒక్క నామినేషన్‌ వేయలేదు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థితో సహా, ఇప్పటివరకు ఒక్క నామినేషన్‌ వేయలేదు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 32 వార్డులకు 18 చోట్ల మాత్రమే నామినేషన్లు పడ్డాయి. ఛైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ వేయలేదు. రాజంపేట మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను 7 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు పడ్డాయి. చైర్మన్‌ పదవికి వేసిన నామినేషన్‌ పత్రాలు చించేశారు.
    రాయచోటి మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి సహా 44 డివిజన్లకు గాను ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. పుంగనూరు మున్సిపాలిటీలో చైర్మన్‌ సహా 36 వార్డుల్లో ఒక్క చోట కూడా నామినేషన్‌ వేయనీయ లేదు. దర్శి మున్సిపాలిటీలో 28 వార్డులకు మూడు చోట్ల మాత్రమే నామినేషన్‌  వేయగలిగారు. ఛైర్మన్‌ అభ్యర్థి ఇంకా నామినేషన్‌ వేయలేదు.
    గురజాల మున్సిపాలిటీలో చైర్మన్‌ సహా ఒక్క వార్డుకు నామినేషన్‌ వేయలేదు. దాచేపల్లి మున్సిపాలిటీలో చైర్మన్‌ స్థానానికి సహా ఒక్క నామినేషన్‌ కూడా వేయలేదు. పిడుగురాళ్లలో చైర్మన్‌ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా వేయలేదు.

అక్రమ కేసులు:
    ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవీ. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మా పార్టీ చైర్మన్‌ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ లిక్కర్‌ను సాక్షాత్తు పోలీసులే పెట్టి, అక్రమ మద్యం అని చెప్పి ఆయనను అరెస్ట్‌ చేసి జైలుకి పంపించారు. పోలీసులే స్వయంగా పెట్టి ఇదంతా చేశారు. పిడుగురాళ్లలో కూడా ఇలాగే అభ్యర్థులను పోలీసులే ఎత్తుకెళ్లారు. హైకోర్టు జోక్యం చేసుకుని వారిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి.. మూడు చోట్ల చైర్మన్‌ అభ్యర్థులను పోలీసుల చేత అరెస్ట్‌ చేయించారు.
    ఎన్నికలు సజావుగా జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబుగారు ఇవన్నీ చేయిస్తున్నారు.

మా పోరాటం ఆగబోదు. ప్రజల పక్షాన నిలబడతాం.
వారందరికీ నా శాల్యూట్‌. హ్యాట్సాఫ్‌:

    నేను ఇవాళ ఒకటే మాట చెబుతున్నాను. నామినేషన్ల గడువు (మ. 3 గం.) ముగిసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో.. సాక్షాత్తు ప్రభుత్వం, ఎస్‌ఈసీ, పోలీసులు అన్నీ వ్యవస్థలు ఒక్కటై అధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే.. ప్రజల తరఫున, ప్రజల గొంతుకై వైయస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలబడుతుంది.
    ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా, గట్టిగా చంద్రబాబునాయుడుగారి వెన్నుపోటు పార్టీని ఎదుర్కొనే కార్యక్రమం చేస్తుంది. ఇంతవరకు ఇన్ని కష్టాలను ఓర్చి నిలబడ్డ ప్రతి వైయస్సార్‌సీపీ కార్యకర్తకు, చంద్రబాబు తుపాకీ తూటాలకు వెరవకుండా, పోలీసుల లాఠీలకు భయపడకుండా, చంద్రబాబు గుండాల దాడికి బెదరకుండా, వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన ప్రతి వైయస్సార్‌సీపీ కార్యకర్తకు, ప్రతి ప్రజాస్వామ్యవాదికి శాల్యూట్‌ చేస్తున్నాను. హ్యాట్సాఫ్‌ చెబుతున్నాను.

తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోము:
    ఈ అప్రజాస్వామిక పాలన, ఈ మోసపూరిత, ఆపద్ధర్మ పాలన ఎంతో కాలం నిలబడదు. చూస్తుండగానే దాదాపు మూడేళ్లు. కళ్లు మూసుకుని తెరిచేలోగా మరో రెండేళ్లు. కానీ, ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు నాటే ఈ విష విత్తనాలు రేపొద్దున చెట్లు అవుతాయి. ఎవరెవరైతే ఇప్పుడు తప్పు చేస్తున్నారో.. అన్నీ పక్కా సాక్ష్యాలున్నాయి కాబట్టి, చట్టం ముందర వాళ్లందరినీ దోషులుగా నిలబెట్టే పరిస్థితి త్వరలోనే వస్తుంది.
    ఏదో ఇప్పుడు మేము అక్రమంగా చేసేస్తున్నాం కదా అని అనుకుంటున్నారేమో. ప్రతి అధికారికీ నేను చెబుతున్నా. అన్యాయం చేసిన ప్రతి అధికారికీ చెబుతున్నా. అన్యాయం చేస్తున్న ప్రతి వెన్నుపోటు  పార్టీ నాయకుడికి చెబుతున్నా. టైమ్‌ మీది నడుస్తుండవచ్చు. కానీ మా టైమ్‌ కూడా వస్తుంది. మా టైమ్‌ వచ్చినప్పుడు మీరు చేసిన ఈ నాటకాలే, మీరు చేసిన ఈ అక్రమాలే మీకు తిరిగి చుట్టుకుంటాయి.
    ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గనుక ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు తీసుకోకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు నేను చెప్పినా వినరు. మీరు చేసే ఈ తప్పుడు పనులను గుర్తు పెట్టుకోమని చంద్రబాబునాయుడుని హెచ్చరిస్తున్నా. తప్పుడు సాంప్రదాయాలను, తప్పుడు పద్ధతులను ప్రోత్సహించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నాను.
    తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ముందు నిలబడతారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నా పిలిపించి శిక్ష పడేటట్లు చేస్తాం. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా సర్దుకోండి. ఇప్పటికైనా న్యాయం, ధర్మం వైపు గట్టిగా నిలబడమని చెబుత్తున్నా. ఎస్‌ఈసీకి మరీ ముఖ్యంగా చెప్తున్నా. చంద్రబాబునాయుడుగారు కాదు మీకు పదవి ఇచ్చింది. ఎస్‌ఈసీ అన్న వ్యవస్థకు ఒక గొప్ప పేరు ఉంది. ఆ గౌరవాన్ని కాపాడే కార్యక్రమం ఎస్‌ఈసీ చేయకపోతే, ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోతుంది.
    పోలీసులందరికీ నేను చెబుతున్నా. చంద్రబాబునాయుడుగారు మీకు జీతాలు ఇచ్చేది మీ నెత్తిన ఉన్న ముూడు సింహాలు ఆయనకు  శాల్యూట్‌ చేయడానికి కాదు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి శాల్యూట్‌ చేయడానికి. అందుకే ప్రతి పోలీసుకూ చెబుతున్నా. ఇలాంటి అక్రమాలు, తప్పులు చేయకండి.

ఇది ఆరంభం మాత్రమే:
    నామినేషన్లు వేసిన ప్రతి చోటా పోరాటం చేస్తుంది. ప్రజల తరఫున గట్టిగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. 2029 జనరల్‌ ఎలక్షన్స్‌ అన్నది ఫినిషింగ్‌ లైన్‌. మీరు చేసే ప్రతి తప్పు ఆ ఫినిషింగ్‌ లైన్‌లో మాకు ఇంకా విజయానికి దగ్గరగా తీసుకెళ్లేలా చేస్తుంది. మా కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలోనూ కసి పెరుగుతుంది. ఆ కసి చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వాన్ని రేపు పొద్దున గద్దె దించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని గట్టిగా చెబుతున్నా.
    ప్రజల సమక్షంలో ప్రజలకు మంచి చేసి, ప్రజల ఓట్లు పొందాలే తప్ప, ప్రజలను భయపెట్టి, అబద్ధాలతోనూ, మోసాలతోనూ ఈ మాదిరిగా అధికారాన్ని చెలలాయించడం అన్నది ధర్మం కాదని మరొకసారి గట్టిగా మీ అందరి ద్వారా చంద్రబాబుకు తెలియజేస్తున్నానని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
వ్యవస్థల్లో మార్పు రావాలి:

    2024 ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారయ్యాయి. దాన్ని నేను ఆనాడే ప్రస్తావించాను. కోర్టులకూ కొందరు వెళ్లారు. కానీ వ్యవస్థలో మార్పులు రానంత కాలం మనం ఏమీ చేయలేము. ఎస్‌ఈసీ, సీఈసీని అధికార పార్టీ నామినేట్‌ చేయడం సరికాదు. ఇంతకుముందు కేంద్రంలో ఇలా అధికార పార్టీనే నామినేట్‌ చేసే ప్రక్రియకు వైయస్‌ఆర్‌సీపీ అప్పట్లో మద్దతిచ్చింది. అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాం. ఎందుకంటే అది విద్యార్థులే ఎగ్జామినర్‌ను నియమించినట్లుగా ఉంటుంది.

సీఈసీ, ఎస్‌ఈసీ నియామక విధానం మారాలి:
    సీఈసీ ఎంపిక విధానం ఇప్పుడున్నది సరికాదు. ఆ మేరకు సీఈసీ. ఎస్‌ఈసీ నియామకాల్లో మార్పులు రావాలి. అందుకు ఒక న్యూట్రల్‌ బాడీ మళ్ళీ రావాలి. లీడర్‌ ఆఫ్‌ ది అపోజిషన్, సీజేఐ (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి), ప్రధాని ముగ్గురూ కలిసి ఓటు హక్కు వినియోగించి ఎన్నుకోవాలి. అప్పుడు సీజేఐ ఆ కమిటీలో ఉంటారు కాబట్టి అది ఒక న్యూట్రల్‌ బాడీ కింద కనిపిస్తుంది.
    అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కూడా అదే సంస్కరణ రావాలి. ఎస్‌ఈసీని సీఎం లేదా అధికార పార్టీ నియమించొద్దు. ఇక్కడా న్యూట్రల్‌ వ్యవస్థ రావాలి. అంటే లీడర్‌ ఆఫ్‌ ది అపోజిషన్, హైకోర్టు చీఫ్‌ జస్టిస్, ముఖ్యమంత్రి ముగ్గురూ కలిసి అపాయింట్‌ చేసే పరిస్థితి రావాలి. ఈ మార్పులు వస్తే.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top