నారాసుర రక్త చరిత్ర

వైయ‌స్ జ‌గ‌న్ ఫైర్‌

తాడేపల్లి: చంద్రబాబు, ఎస్‌ఈసీ దుర్మార్గంగా వ్యహరిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏకపక్షంగా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

‘‘19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేశాం. కేవలం 4 చోట్ల మాత్రమే రీ నామినేషన్‌కు ఇచ్చారు. మైదుకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు,  రాజంపేటలో 11 వార్డులకు మాత్రమే రీనామినేషన్‌ ఇచ్చారు. కడపలో 66 వార్డులున్నాయి. 11 చోట్ల మాత్రమే రీనామినేషన్‌. రాజంపేటలో 32 వార్డులుంటే.. 11 వార్డుల్లో రీనామినేషన్‌ అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారా? లేక చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారా?

‘‘19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదని సుప్రీంకోర్టుకు వెళ్లాం. స్క్రూటినీ పేరుతో అన్యాయంగా నామినేషన్లు రిజెక్ట్‌ చేశారు. 23 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌లో పోటీనే లేకుండా కొన్ని చోట్ల నామమాత్రంగానే పోటీ జరిగేలా చూశారు. చిత్తూరు, నగరి, చిలకలూరిపేట, నెల్లూరులో స్క్రూటినీ పేరుతో నామినేషన్లు రద్దు చేశారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిని ఏమనాలి?. 15 చోట్ల ఏకంగా పోటీనే లేకుండా చేశారు. 8 చోట్ల నామినేషన్లనే అనుమతించలేదు. మరో 7 చోట్ల స్క్రూటినీ పేరుతో డిస్‌ క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది న్యాయమెలా అవుతుంది?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

చంద్రబాబువా..? శకునివా..? నారాసుర రక్త చరిత్ర...
‘‘నామినేషన్లు వేయించి ధైర్యంగా ఎందుకు ఓట్లు ఎందుకు అడగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని ఎన్నికలంటారా?. మహాభారతంంలో శకునికి పాచికలు ఉండేవి. ఏ నెంబర్‌ కావాలంటే ఆ నెంబర్‌ పడేలా గేమ్‌ సెట్‌ చేసేవారు. ఈ వ్యవస్థలో చంద్రబాబే శకుని.. చంద్రబాబు రూల్స్‌ సెట్‌ చేస్తున్నారు
నామినేషన్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికల పరిస్థితేంటి?. మూడేళ్లు కావొస్తుంది..  మీ పనితీరు చూపించి ఓట్లు అడగాలి. కోవిడ్‌ లాంటి విపత్తులో కూడా ప్రజలకు మేం మంచి చేశాం. 90 శాతం హామలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాం’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

Back to Top