ఉగ్రదాడిలో ఏపీవాసుల మృతిపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయ‌న త‌న ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప‌ర్యాట‌కుల‌ను దారుణంగా కాల్చి చంప‌డం అమాన‌వీయ చ‌ర్య అన్నారు. ఉగ్ర‌దాడిలో విశాఖ‌, కావ‌లికి చెందిన చంద్ర‌మౌలి, మధుసూద‌న్ మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. బాధిత కుటుంబాల‌కు కేంద్రం అండ‌గా నిల‌వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. 

సాయంత్రం జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ

  
 కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైయస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించనుంది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈరోజు సాయంత్రం ర్యాలీలు చేప్టటనుంది. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్‌ ఈమేరకు పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు.  దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పార్టీ శ్రేణులు క్యాండిల్‌ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు.

Back to Top