తాడేపల్లి: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్ `కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి. కోట శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.