తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని అన్నారు.