శ్రీసత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు శ్రీసత్యసాయి జిల్లా అపూర్వ స్పందన లభిస్తోంది. కదిరి పట్టణం జనసంద్రంగా మారింది. జనమే జగన్ అన్నట్లుగా మారింది. సాయంత్రం 5.45 గంటలకు కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర...కదిరిలో జన సునామీగా మారింది. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన జనప్రభంజనం దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుతో పాటు కడలితరంగాల్లా కదిలిన జనం. గజమాలతో ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. బస్సు మీద నుంచి ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సెల్‌ఫోన్‌లో టార్చ్ వెలిగిస్తూ ప్రజలు... సీఎం వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేశారు. 7.55 వరకు సుమారు రెండు గంటల పదినిమిషాలు పాటు కదిరిలో రోడ్‌షోలో జనంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొన్నారు.