తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైయస్ఆర్‌సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులు వర్షిత రెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిని శ్రీ వైయస్ జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శ్రీ వైయస్ జగన్ వారికి ఆశీస్సులు అందించారు.