ఏపీలో అరాచ‌క పాల‌న‌

చంద్రబాబు సర్కార్‌పై ఎంపీ అవినాష్‌రెడ్డి ఫైర్‌
 

వైయ‌స్ఆర్‌ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోందని.. వందరోజుల్లోనే చంద్రబాబు సర్కార్‌  అసంతప్తి మూటగట్టుకుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ నరసింహను చంపారన్నారు. అక్రమ మైనింగ్‌ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పులివెందులతో పాటు జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కతి లేదు. వైయ‌స్‌ జగన్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తేవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

‘‘పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం అడ్మిషన్లు రాకుండా చేసింది. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.

Back to Top