వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై ప‌చ్చ గూండాల దాడి

తిరుపతి:  టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపై టీడీపీ గుండాలు భౌతిక దాడులకు తెగ‌బ‌డ్డారు. మహిళలు అని కూడా చూడకుండా వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాళ్లపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌ను వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుప‌తిలోని తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో అరెస్టైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అభిన‌య్‌రెడ్డి పరామర్శించారు. టిటిడి చైర్మన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ… టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపై టీడీపీ గుండాలు భౌతిక దాడులకు దిగార‌ని మండిప‌డ్డారు. మహిళలు అని కూడా చూడకుండా వైయ‌స్ఆర్‌ సీపీ నాయకురాళ్లపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడూ చూడలేదని, పోలీసుల సమక్షంలో దాడులు చేసిన వారిని వదిలేసి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన చర్య కాదని ఆయన మండిపడ్డారు. తమవారు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Back to Top