గుంటూరు: ఆంధ్రజ్యోతి (ఏబీఎన్) రాధాకృష్ణపై ఇప్పటికే గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మరోసారి గుంటూరు జిల్లా ఎస్పీని వైయస్ఆర్‌సీపీ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలపై ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి యేసు రత్నం, గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ ఇంచార్జ్ అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ బలవజ్ర బాబు (డైమండ్ బాబు), ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ బలసాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టం ముందు అందరూ సమానమని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.