టీడీపీ నేత వినోద్ జైన్‌ను క‌ఠినంగా శిక్షించాలి

రాజ‌మండ్రిలో మ‌హిళ‌ల భారీ నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌
 

తూర్పు గోదావ‌రి :  విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్‌జైన్‌ ఘాతుకంపై రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. బాలికను లైంగిక వేధింపులకు గురిచేసి.. ఆత్మహత్యకు కారణమైన వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. సోమ‌వారం రాజ‌మండ్రి న‌గ‌రంలో మ‌హిళ‌లు భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స‌మీపంలో ఏర్పాటైన‌ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద  రుడాచైర్ ప‌ర్స‌న్ మేడపాటిషర్మిళరెడ్డి ,  మహిళ విభాగం అధ్యక్షురాలు , మినరల్ డైరెక్టర్ మార్తా లక్ష్మి ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం లో 14 ఏళ్ళ బాలిక  గౌరీ దీక్షిత్ పైన టీడీపీ నేత వినోద్ చేసిన అఘాయిత్యానికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. అనంత‌రం మానవహారంగా ఏర్ప‌డి టీడీపీ నేత‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండు చేశారు. కార్యక్రమంలో మజ్జి నూకరత్నం  ,అనసూరి పద్మలత ,హసీనా ,నిరక్షనా జేమ్స్ , సరిత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top