ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా?

మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి  

డోన్‌లో మున్సిపల్ కమిషనర్ తీరుపై ఆగ్ర‌హం

నంద్యాల జిల్లా:  ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా? అని మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు.  డోన్ ప‌ట్ట‌ణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వాకింగ్ కోసం మున్సిపల్‌ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు  మున్సిపల్ కమిషనర్ తాళాలు వేయించారు. పార్క్‌కు వెళ్లిన బుగ్గ‌న‌ను  వాకింగ్ చేయ‌కుండా పార్కు సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్‌ కమిషనర్‌ స్పందించలేదు. 
మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్‌ పార్‌కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. రేపు బ్యాట్ ప‌ట్టుకొని వ‌స్తే షెటిల్ కోర్డు కూడా మూస్తారా?  రోడ్డుపై న‌డిస్తే రోడ్డును కూడా బ్లాక్ చేస్తారా అంటూ బుగ్గ‌న ధ్వ‌జ‌మెత్తారు.
 

Back to Top