విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. తనను హతమార్చుతామంటూ అగంతకులు 96187 29089, 95383 62525, 82476 62578, 88860 59309 అనే నంబర్ల నుంచి బెదిరించినట్లు విజయసాయిరెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ధర్మాసనం సూచన మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిందితులెవరో గుర్తించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

Back to Top