తాడేపల్లి: సంస్కారహీనుడైన నారా లోకేష్ రాజకీయ నాయకుడుపైగా మంత్రి అవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. లోకేష్ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఫేక్ వీడియోను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వరుదు కళ్యాణి ట్వీట్ చేశారు. ప్రజాసమస్యల నుంచి పక్కదోవ పట్టించడానికి చీప్ ట్రిక్స్ మీకు అలావాటే నారా లోకేష్.. ఇలాంటి ఎడిటింగ్‌లు చేసి, తప్పుడు ప్రచారం చేయడం పెద్ద కష్టమైన పనికాదు. ఏ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అయినా పూర్తిగా చూడకుండా, కటింగ్‌లు చేస్తే, ఏదైనా ఇలాగే కనిపిస్తుంది. మీరు సంస్కారహీనులు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు. మీరొక్క రాజకీయ నాయకుడు పైగా మంత్రి అవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. మీ అమ్మను మీరెప్పుడైనా ఇంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? పోనీ మీ తండ్రి చంద్రబాబు గారు, ఆయన తల్లిని, అంటే మీ నాయనమ్మను ఎప్పుడైనా ఇలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారా? అలాంటి సందర్భం కనీసం మీరు ఎప్పుడైనా చూశారా లోకేష్. చంద్రబాబు గారి ఇద్దరు చెల్లెళ్లు, అంటే మీ మేనత్తలు, వారికి ఎన్ని ఆస్తులు ఇచ్చారు? మా అన్న చంద్రబాబు గారు ఇది ఇచ్చారని ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాజేశ్వరి అయినా, హైమావతి అయినా ఏరోజైనా చెప్పుకోగలిగారా? అసలు వారిద్దరూ చంద్రబాబు చెల్లెళ్లు అని, మీ మేనత్తలని రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు? దేశంలోనే అత్యంత ధనిక సీఎం అయిన మీ తండ్రి , మీ బాబాయ్‌కు ఏమేర ఆస్తులు ఇచ్చారు? మీ మేనత్తలకు, మీ బాబాయ్‌కి మీరైనా, మీ తల్లి గారైనా ఏరోజైనా ఏమైనా ఇవ్వనిచ్చారా? ఇచ్చే మనసు కనీసం నీ తండ్రి గారైన చంద్రబాబు గారికైనా ఉందా? మీ కుటుంబ పరిస్థితి ఇదే అయినప్పుడు మరొకరి గురించి ఎలా మాట్లడతారు ? జగన్ గారు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తలెత్తుకుని చెప్పుకోగలుగుతారు... వాళ్ల తండ్రి గారు స్వర్గస్తులైన తర్వాత తన సోదరికి రూ.230 కోట్లు ఇచ్చాడని తలెత్తుకుని చెప్పుకోగలుగుతాడు. అలా చెప్పుకునే పరిస్థితి మీకు ఉందా లోకేష్ ? మీ మేనత్తలకు అలాంటి సహాయం చేసే గుణం మీకు ఉందా? పలానావాళ్లు నా చెల్లెలు అని మీ నాన్న, పలానా వాళ్లు మా మేనత్తలు అని మీరు, పలానావాళ్లు మా ఆడపడుచులని మీ తల్లి గారు చెప్పుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? మీరు విచ్చలవిడి అవినీతిలో మునిగిపోయి, రైతుల ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి, ఒక అబద్ధాన్ని సృష్టించి, దానికి రెక్కలు కట్టి, రాజకీయం చేయగలగడం మీకు మాత్రమే చెల్లింది లోకేష్ .