విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్టేదని వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆందోళేన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ ఘటనను వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. ఇది 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు.. హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ లను బయటకు వదులుతున్నారు అంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టింది గాని ఆడపిల్లల మాన ప్రాణాలు గురించి పట్టించుకోవట్లేదు. కూటమి నాయకులు, మంత్రులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు అంటూ వరుదు కళ్యాణి విమర్శించారు.