చీరాలలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన.. 

సూపర్ సిక్స్ హామీలపై రౌండ్ టేబుల్ సమావేశం 

 చీరాల : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సూచనల మేరకు చీరాల వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాలపై చీరాలలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, వైద్యులు, ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సూపర్ సిక్స్ హామీల అమలు పరిస్థితి, ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం వల్ల ప్రజలు నిరాశకు గురయ్యారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

అనంతరం చీరాల పట్టణంలోని కారంచేడు రోడ్డు గేట్ సెంటర్ (జేఎంజేఎం సర్కిల్) వద్ద ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top