థ్యాంక్యూ జ‌గ‌న‌న్న‌

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మాజీ ఎమ్మెల్యే వంశీ 

కష్టకాలంలో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంశీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్ జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11  అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దీంతో విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి ఈ నెల 2వ తేదీ వంశీ విడుదలయ్యారు. 

Back to Top