థ్యాంక్యూ సీఎం సార్‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కొత్త మంత్రుల కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం అనంతరం  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డిని కుటుంబసభ్యులతో పాటు కలిసి కృతజ్ఞతలు తెలిపిన పలువురు మంత్రులు. 

ముఖ్యమంత్రిని కలిసిన పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్‌ అండ్‌ కామర్స్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రహదారుల, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)లు సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top