`గ‌డ‌ప గ‌డ‌ప‌కు` ప్రజల మద్దతు 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో త‌మ్మినేని సీతారాం
 

శ్రీ‌కాకుళం:  ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన్నారు. శ‌నివారం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ఆరా  తీశారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకొని వాటి పరిష్కారానికి త‌క్ష‌ణ‌మే చొర‌వ చూపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ ఇక ప్యాకప్ అనేశారు.. పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నార‌ని విమ‌ర్శించారు. అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు అన్నారు. పొలిటికల్ ఫిలాసఫీతో సీఎం వైయ‌స్‌ జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తున్నారని తెలిపారు.
పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి.. ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారని.. కానీ, గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్‌ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

 
గ్రామంలో పరిపాలన ఉండాలనే, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్‌ రెడ్డి పాలనను డీసెంట్రలైజ్ చేశారని  తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు ఎందరు కలిసినా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేరు.. గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టే అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ ఇతర టీడీపీ నాయకులూ సమర్ధిస్తారా? అని ప్ర‌శ్నించారు. మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. చట్టం తన పని తను చేస్తుంది… విచారణ జరిపి చర్యలు తీసుకుంటానన్నారు.

రాజకీయ మధ్యవర్తి లేకుండానే పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయన్న తమ్మినేని.. మా ముఖ్యమంత్రి పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదు.. పవిత్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజలలో కన్ఫ్యూజన్ చేయడానికి సర్కస్ ఫీట్స్ చేస్తున్నాయని త‌మ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top