పాణ్యంలో టీడీపీకి షాక్‌

10 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నంద్యాల‌:  అధికార తెలుగు దేశం పార్టీకి పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో షాక్ త‌గిలింది. కూట‌మి ప్ర‌భుత్వ తీరు న‌చ్చ‌క టీడీపీని వీడిన 10 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరాయి.  నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో తమ్మరాజు పల్లె కు చెందిన 10 కుటుంబాలు టీడీపీకి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీ చేరాయి.  త‌మ్మరాజుపల్లె గ్రామ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  కోడె శేషయ్య ఆధ్వర్యం లో  కాటసాని రాంభూపాల్ రెడ్డి  సమక్షంలో టీడీపీ నేత‌లు గోవర్ధన్ , ఎం మహేంద్ర, పి హరీష్, సి వేణు, ఎన్ శ్రీధర్, ఎన్ కేశవ, ఎం మద్దిలేటి, పి రాజేష్, ఎం మహేంద్ర, షేక్ హుస్సేన్ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి కాటసాని రాంభూపాల్ రెడ్డి  పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని కాట‌సాని పిలుపునిచ్చారు.

Back to Top