వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు

ప్రకాశం జిల్లా: ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ప్ర‌కాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వ‌ద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్‌ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్‌ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్‌ కిరణ్‌లు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. అంతేకాకుండా బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్‌ గౌడ్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి ఉన్నారు. 

Back to Top